ఓటీటీలోకి రజాకార్..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీలోకి రజాకార్..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం ‘రజాకార్‌‌‌‌’.  గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. గతేడాది థియేటర్స్‌‌లో మెప్పించిన ఈ చిత్రం ఈ నెల 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో నటి ఇంద్రజ మాట్లాడుతూ ‘రజాకార్ల అకృత్యాలపై తీసిన గొప్ప డాక్యుమెంటరీ ఇది. విభేదాలు సృష్టించే సినిమా కాదు.  చరిత్రను చూపించే చిత్రం.  ఇందులో చాకలి ఐలమ్మ పాత్రలో నటించడం సంతోషంగా ఉంది’ అన్నారు.  దర్శకుడు ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రం తీశారని నటుడు నాగ మహేష్ చెప్పారు.  

దర్శకుడు మాట్లాడుతూ ‘తెలుగుతో పాటు హిందీ, మరాఠీ భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. 15 ఫిలిం ఫెస్టివల్స్‌‌కు ఎంపికైంది. గోవాలో జరిగిన ఇఫ్పీలో బెస్ట్ ఇండియా డెబ్యూగా నమోదై,  బెస్ట్ డైరెక్టర్​గా నామినేట్ అయ్యా. అలాగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌‌లోనూ మంచి అప్లాజ్ వచ్చింది.  ఫిలిం ఫెస్టివల్స్, హిందీ రిలీజ్ వల్ల ఓటీటీ ఆలస్యమైంది.  ఫ్యామిలీ అంతా కలిసి చూడండి’ అని చెప్పాడు. నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘డబ్బు కోసం కాకుండా ఒక బాధ్యతతో ఈ సినిమా చేశాం. రేపటి తరాలు రజాకార్ల అకృత్యాలను తెలుసుకునేలా కళ్లకు కట్టినట్లు చూపించాం. ఎన్నో బెదిరింపులు వచ్చినా లక్ష్యపెట్టలేదు.   ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎంతో సంతృప్తిని మిగిల్చింది. ఓటీటీ ద్వారా మరింత ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం’ అన్నారు.