రజాకార్ మూవీ కలిసి చూద్దాం : బండి సంజయ్

యాదాద్రి, వెలుగు; రజాకార్​ సినిమాను కలిసి చూద్దామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డితో అన్నారు. రజాకార్​ సినిమా నిర్మాత అయిన గూడురు గురువారం హైదరాబాద్‌లో సంజయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంజయ్​  మాట్లాడుతూ నైజాం నిరంకుశ పాలనతో నాటి హైదరాబాద్​ స్టేట్​ ప్రజలు పడిన ఇబ్బందులను నేటి తరానికి తెలిపేందుకు సినిమా తీయడం అభినందనీయమన్నారు.

 ప్రజలకు నిజమైన చరిత్ర తెలియకుండా లౌకిక పార్టీలుగా చెప్పుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, వామపక్షాల నిజస్వరూపాన్ని ఈ సినిమా బయట పెడుతుందని అన్నారు.