దేశంలో బీసీ కులాల సాంఘిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. నేటికీ వేలాది బీసీ కులాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. నిధుల్లో వారి వాటా వారికి దక్కాలంటే కులాల వారీగా బీసీలను లెక్కించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో దాదాపు 75 రకాల మంత్రిత్వశాఖలు ఉన్నాయి. డెబ్బై కోట్లకు పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం కనీసం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. రూ. 39.45 లక్షల కోట్ల దేశ బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి కేటాయింపులు రూ.1200 కోట్లకు మించకపోవడం దారుణం. బీసీ గణన లేకపోవడం వల్ల దేశంలో ప్రస్తుతం అమలవుతున్న బీసీ రిజర్వేషన్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇతర సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం 27 శాతం అత్తెసరు రిజర్వేషన్లు అమలు చేయడం, ఇందులోనూ క్రిమీలేయర్ పరిమితి విధించడం సమర్థనీయం కాదు. సెంట్రల్వర్సిటీల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రిమీలేయర్ మూలంగా బీసీలకు 13 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు కావడం లేదని పార్లమెంటులో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.
చాలా రాష్ట్రాలు ఓకే చెప్పినా ?
కులాల వారీగా బీసీల లెక్కింపు వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్15, 16 ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వాళ్ల అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. కులాల వారి లెక్కలు తీయడం వల్ల కులతత్వం, ఆందోళనలు పెరుగుతాయనడం ఊహాజనితమే. మతాల వారీగా, ఇతర ఎస్సీ, ఎస్టీ కులాల లెక్కలు తీస్తే రాని ఘర్షణలు బీసీల విషయంలోనే వస్తాయా? బీసీల లెక్కింపునకు జన గణన పట్టికలో అదనంగా ఒక కాలం పెరుగుతుందే తప్ప, ప్రభుత్వానికి ఖర్చు ఉండదు.
కోర్టు తీర్పులను లెక్కచేయరా ?
కోర్టుల తీర్పులు అమలుచేయడానికి కూడా ప్రభుత్వాలు ఎన్నో కారణాలు చెబుతున్నాయి. గతంలో మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీల రిజర్వేషన్లు పెంచినప్పుడు, 1986లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మురళీధర్‌రావు కమిషన్ సిఫార్సు ప్రకారం ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచినప్పుడు కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని, పెంచిన రిజర్వేషన్లను కొట్టేశాయి కూడా. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్నాటక ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా అవి చెల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచుకోవచ్చని స్పష్టమైన తీర్పులు ఉన్నా.. ప్రభుత్వాలు స్పందించడం లేదు.
బీసీ కమిషన్లు ఉన్నా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ. వాటికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో అవి నామ్ కే వాస్తేగా మారుతున్నాయి. ఇంచుమించు 9 దశాబ్దాల క్రితం1931లో తీసిన జనాభా లెక్కలపైనే ఇప్పటికీ ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం బీసీ కులాలను మోసం చేయడమే కదా! 1961లో కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్, 1978లో నియమించిన మండల్ కమిషన్ కూడా బీసీ జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీ కులాల జనగణన విషయంలో చొరవ తీసుకుని ఉంటే.. దేశంలో మెజార్టీ జనాభా కలిగిన బీసీ కులాల రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ అవకాశాలు మెరుగైన దశలో ఉండేవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. ప్రభుత్వాలకు బీసీల ఓట్లపై ఉన్న శ్రద్ధ, వాళ్ల బతుకులు మార్చడంపై ఉండటం లేదు. జాతీయ స్థాయిలో బీసీ కులాలకు నమ్మకం కలిగించే గట్టి నాయకత్వం ఎదగలేకపోవడం, బీసీ కులాల నాయకులు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా, ఐక్యంగా ఉద్యమించక పోవటం వల్లే బీసీలకు అందాల్సిన ఫలాలు వేగంగా అందడం లేదు.
అభివృద్ధికి ఆమడ దూరంలో బీసీ కులాలు : -

- డా.బి కేశవులు, ఎండీ సైకియాట్రిస్టు, ఛైర్మన్ రాష్ట్ర మేధావుల సంఘం