రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆర్‌బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తవడంతో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో విద్యార్థుల మేధాశక్తిని పరీక్షించేందుకు 'ఆర్బీఐ-90' పేరుతో ఈ క్విజ్ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబరు 19 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. 2024 సెప్టెంబరు 1 నాటికి 25 ఏళ్లలోపు వయసు ఉండి ఏదైనా కళాశాలలో డిగ్రీ చదువుతున్న వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ప్రతి కాలేజ్ నుంచి ఎంతమంది విద్యార్థులైనా అప్లై చేసుకోవచ్చు. ఒక్కో టీమ్‌లో కనీసం ఇద్దరు విద్యార్థులు ఉండాలి. మొత్తం నాలుగు దశల్లో క్విజ్ పోటీలు జరగనున్నాయి. తొలుత జిల్లా స్థాయి, ఆన్‌లైన్ దశ ప్రారంభమై రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ ల్యాంగేజ్ లో ప్రశ్నలు అడుగుతారు.
ప్రధానంగా దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, చరిత్ర, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమకాలీన అంశాలు, తదితరాలపై ప్రశ్నలుంటాయి. విద్యార్థుల్లో రిజర్వు బ్యాంకు ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహనతోపాటు డిజిటల్ లావాదేవీలు, సురక్షిత బాధ్యతాయుత వినియోగం తదితరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ పోటీలను నిర్వహిస్తోంది.
అప్లికేషన్ ప్రక్రియ :
-
అధికారిక వెబ్‌సైట్ rbi90quiz.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
-
స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-
రిజిస్ట్రేషన్ పేజీలో విద్యార్థులు తమ వివరాలు సమర్పించాలి. రాష్ట్రం, జిల్లా, కళాశాల వివరాలు నమోదుచేయాలి.
-
పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు పేర్లు ఎంటర్ చేయాలి.
-
దరఖాస్తు సమయంలో స్టూడెంట్ ఐడీ, ఈమెయిల్, ఫోన్ నంబర్, జెండర్, పుట్టినతేదీ తదితర వివరాలు సమర్పించాలి.
-
డిటేల్స్ అన్ని నింపిన తర్వాత ఒకసారి సరిచూసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
-
దరఖాస్తు కోసం విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.