
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
సెలెక్షన్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ALSO READ: నిధులు ఆపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ కంటతడి
ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్)లో ఇంగ్లీష్ లాంగ్వేజ్(30 ప్రశ్నలు–- 30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(35 ప్రశ్నలు-–35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35 ప్రశ్నలు-–35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. మెయిన్స్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధిస్తే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ అక్టోబర్ 21, 23న నిర్వహిస్తారు. మెయిన్స్ డిసెంబర్ 2న జరగుతుంది. వివరాలకు www.rbi.org.in వెబ్సైట్లో సంప్రదించాలి.