
న్యూఢిల్లీ: డిజిటల్ కార్యక్రమాలు చేపట్టినందుకు రిజర్వ్ బ్యాంక్ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ‘డిజిటల్ ట్రాన్సఫర్మేషన్అవార్డు 2025’కు ఎంపికయింది. యూకే సెంట్రల్ బ్యాంకు దీనిని ప్రదానం చేస్తుంది. ఆర్బీఐ ప్రవాహ్, సారథి అనే రెండు డిజిటల్ కార్యక్రమాలను చేపట్టింది. వీటిని సంస్థ డెవలపర్ టీమే అభివృద్ధి చేసింది. సారథిని 2023 జనవరిలో అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కంపెనీలు రికార్డులను సురక్షితంగా స్టోర్ చేయవచ్చు.
సారథి వల్ల కాగితం వాడకం చాలావరకు తగ్గిందని అవార్డుల కమిటీ ప్రశంసించింది. యూజర్లు ఆర్బీఐకి సులభంగా రెగ్యులేటరీ అప్లికేషన్లను అందజేయడానికి ప్రవాహ్ను గత ఏడాది మేలో అందుబాటులోకి తెచ్చారు. ఈ పోర్టల్లోని డాక్యుమెంట్లు అన్ని ఆర్బీఐ ఆఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. ప్రవాహ్ ద్వారా ఇప్పటి వరకు 70 రెగ్యులేటరీ అప్లికేషన్లను డిజిటైజ్ చేశారు.