న్యూఢిల్లీ: గ్లోబల్‌గా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలగడం ఇండియాలోని బ్యాంకులపై పెద్దగా ప్రభావం చూపలేదని ఆర్‌బీఐ క్లారిఫై చేసింది. పది ఇండియన్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) కొంత టెక్నికల్ సమస్యలు ఎదుర్కొన్నా, అవి వెంటనే పరిష్కారం అయ్యాయని తెలిపింది.
జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ సూచనలు ఇచ్చింది. కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని పేర్కొంది. తాము టెక్నికల్ సమస్యలను ఎదుర్కోలేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ ప్రకటించాయి. మరికొన్ని బ్యాంకులు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి.