1600తో మొదలయ్యే నెంబర్‌‌‌‌తోనే బ్యాంకులు కాల్ చేయాలి

న్యూఢిల్లీ:  ట్రాన్సాక్షన్లకు సంబంధించి కస్టమర్లకు ఫోన్ చేయాలంటే 1600 తో మొదలయ్యే నెంబర్‌‌‌‌నే వాడాలని బ్యాంకులకు ఆర్‌‌‌‌బీఐ ఆదేశించింది. ప్రమోషనల్స్‌‌కు సంబంధించి బ్యాంకులు, ఆర్‌‌‌‌బీఐ లైసెన్స్ పొందిన ఇతర సంస్థలు 140తో మొదలయ్యే నెంబర్‌‌‌‌నే వాడాలని తెలిపింది. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంది. కస్టమర్ల డేటాబేస్‌‌ను మానిటర్‌‌‌‌ చేయాలని పేర్కొంది.