Gold Loans:గోల్డ్లోన్ తీసుకుంటున్నారా..అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Gold Loans:గోల్డ్లోన్ తీసుకుంటున్నారా..అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు మంజూరు చేయడంలో గోల్డ్ లోన్ లెండర్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది.

బంగారం స్వచ్ఛత, బరువు పరీక్షించడం, ధృవీకరణలో భారీ వ్యత్యాసాలు, రుణం- విలువ నిష్పత్తిలో ఉల్లంఘనలు, ఎక్కువ నగదు పంపిణీ, చట్ట పరిమితులకు మించి వసూలు చేయడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆర్బీఐ గుర్తించింది. మూడు నెలల్లోగా సెంట్రల్ బ్యాంక్ సీనియర్ సూపర్ వైజరీ మేనేజర్ కు యాక్ష న్ రిపోర్టును సమర్పించాలని గోల్డ్ లోన్ లెండర్లను ఆర్బీఐ ఆదేశించింది. 

ఆర్బీఐ రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించకపోవడం తీవ్రంగా పరిగణించిన ఆర్బీఐ గోల్డ్ లోన్ లెండర్లపై చర్యలకు సిద్ధమయింది. గోల్డ్ లోన్ పై ఆర్బీఐ కొత్త విధివిధానాలను సమీక్షించుకోవాలని తేడాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని పర్యవేక్షక సంస్థలకు సెంట్రల్ బ్యాంక్ సూచించింది. 

ALSO READ | బీ అలర్ట్: అక్టోబర్ ఒకటి నుంచి ఇవన్నీ మారుతున్నాయి.. అందరూ తెలుసుకోవాలి..!

గోల్డ్ లోన్ వ్యాపారాలకు సంబంధించి మార్కెట్ పార్టిసిపెంట్లు ఆందోళనలు చేస్తుండటంతో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. ఇటీవల ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారంపై మార్చిలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది.