- రెమిటెన్స్ మన ఆర్థిక వ్యవస్థకు కీలకం
న్యూఢిల్లీ: ఇండియాకు వచ్చే ఫారిన్ రెమిటెన్స్ (విదేశాల్లోని ఇండియన్ సిటిజన్స్ ఇక్కడి వారికి పంపే డబ్బులు) ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమని, ఇవి రావడానికి పట్టే టైమ్ తగ్గాలని, అయ్యే ఖర్చు కూడా దిగిరావాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది ఏకంగా 111 బిలియన్ డాలర్ల ఫారిన్ రెమిటెన్స్ వచ్చాయి. ఇతర దేశాలు అందుకున్న రెమిటెన్స్‌తో పోలిస్తే ఇండియాలోకే ఎక్కువ వచ్చాయి. ఇంకో రెండేళ్లలో గ్లోబల్‌గా దేశాల మధ్య జరిగే పేమెంట్స్ వాల్యూ 250 ట్రిలియన్ డాలర్లు దాటుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేస్తోంది.
క్రాస్ బార్డర్ (దేశాలను దాటిన) పేమెంట్స్‌లో రెమిటెన్స్ కీలకంగా ఉన్నాయి. ‘క్రాస్ బార్డర్ (దేశాల మధ్య) పీర్ టూ పీర్ పేమెంట్స్‌లో ఇండియాతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలకు రెమిటెన్స్ స్టార్టింగ్ పాయింట్. ఇటువంటి ట్రాన్సాక్షన్లు జరపడానికి పట్టే ఖర్చు, టైమ్ మరింతగా తగ్గించడానికి వీలుంది’ అని ‘సెంట్రల్ బ్యాంకింగ్ ఎట్ క్రాస్‌బార్డర్స్’ కాన్ఫరెన్స్‌లో దాస్ వివరించారు. డాలర్, యూరో, పౌండ్ వంటి కొన్ని మేజర్ కరెన్సీల్లో ట్రేడ్స్‌ను రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) విధానంలో పూర్తి చేయడానికి కుదురుతుందో లేదో? చూడాలని అన్నారు. బైలేటరల్, మల్టీ లేటరల్ విధానాలకు వేగంగా జరిగే క్రాస్‌బార్డర్ పేమెంట్స్‌ను ఇండియా లింక్ చేయడం మొదలు పెట్టిందని, ఇందులో ప్రాజెక్ట్ నెక్సస్ ఉందని దాస్ పేర్కొన్నారు.