సెప్టెంబర్ తర్వాత గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌‌‌‌

సెప్టెంబర్ తర్వాత గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌‌‌‌

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్  ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ సెంటర్ (గుజరాత్‌‌‌‌) (ఐఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీ) లో మొదలవుతుందని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్  శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఐఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీలో  సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌‌‌‌కు వీలుకల్పించే ఫ్రేమ్‌‌‌‌ వర్క్‌‌‌‌ను తీసుకొస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది.

గ్రీన్ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా 2022–23 నుంచి  ఇప్పటి వరకు రూ.36 వేల కోట్లను ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1,697 కోట్లను సేకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.12 వేల కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. కాగా, గ్రీన్ బాండ్ల ద్వారా సేకరించిన ఫండ్స్‌‌‌‌ను పర్యావరణానికి హాని చేయని ప్రాజెక్ట్‌‌‌‌ల కోసం వాడతారు. వీటిని ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు ఇష్యూ చేస్తాయి.  ఫిక్స్డ్‌ వడ్డీ రేటును ఆఫర్‌‌ చేస్తాయి.