
మీ దగ్గర చిరిగిపోయినా, రంగులు అంటిన నోట్లు ఉన్నాయా..? వాటిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే.. మీలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. చిరిగిపోయినా లేదా రంగులు అంటి మాసిపోయిన నోట్లను మార్చుకునే సదుపాయం కల్పించింది. ఇందుకోసం ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది.
ఆర్సీఐ మార్గదర్శకాలు ఫాలో అయ్యి మీ దగ్గర ఉన్న నోట్లను సులభంగా ఛేంజ్ చేసుకోవచ్చు. అన్ని వాణిజ్య బ్యాంకులు వ్యక్తికి ఖాతా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ప్రజల నుంచి డ్యామేజ్ అయినా కరెన్సీని తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకు సిబ్బంది నోటు పరిస్థితిని అంచనా వేసి.. RBI నిబంధనల ప్రకారం వాపస్ మొత్తాన్ని చెల్లిస్తాయి.
చిరిగిన లేదా బాగా చెడిపోయిన నోట్లకు దాని నష్టం స్థాయి ఆధారంగా రిఫండ్ వస్తుంది. అర్థమమ్యే చెప్పాలంటే.. నోటు ఎక్కువగా చిరిగితే తక్కువ డబ్బులు.. తక్కువ డ్యామేజ్ అయితే ఎక్కువ రిఫండ్ వస్తోంది అంతే. మురికిగా, రంగు మారిన లేదా స్వల్పంగా చిరిగిపోయిన నోట్లను మీకు ఖాతా ఉన్న బ్యాంకులో లేదా ఏదైనా ఇతర బ్యాంకు శాఖలో మార్పిడి చేసుకోవచ్చు.
బ్యాంకులు ఆ నోట్లను తీసుకుని అప్పటికప్పుడే ఆ మొత్తాన్ని కస్టమర్ ఖాతాకు జమ చేస్తాయి. లేదా నగదు రూపంలో చేతికి అందిస్తాయి. ఇక.. బాగా చిరిగినా నోట్లు.. రెండు ముక్కలు అయినా కరెన్సీని RBI నోట్ రీఫండ్ నిబంధనల ప్రకారం స్వీకరిస్తారు. వీటిని ఆర్బీఐ సూచించిన బ్యాంకులలో సమర్పించాలి. మనకు వచ్చే వాపసు మొత్తం ఆ నోట్ నష్టంపై ఆధారపడి ఉంటుంది.
ప్రజలకు RBI కీలక మార్గదర్శకాలు:
- దెబ్బతిన్న నోట్లపై టేప్ లేదా స్టేపుల్స్ వాడటం మానుకోండి.
- ఎక్స్చేంజ్ ప్రాసెసింగ్ సజావుగా సాగేందుకు నోట్లను వాటి అసలు స్థితిలో ప్రదర్శించండి.
- ఆర్‌బీఐ మార్పిడి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నోట్లను అంగీకరించడానికి బ్యాంకులు బాధ్యత వహిస్తాయి.