క్యూ4 లో కరెంట్ అకౌంట్ మిగులు

క్యూ4 లో కరెంట్ అకౌంట్ మిగులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా కరెంట్ అకౌంట్  మిగులు నమోదు చేసిందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. సర్వీసెస్ ఎగుమతులు పెరగడంతో  కిందటి ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) జీడీపీలో  0.7 శాతానికి లేదా 23.2 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో సీఏడీ జీడీపీలో 2 శాతంగా లేదా 67 బిలియన్ డాలర్లుగా ఉంది.

గూడ్స్‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ల దిగుమతులు,  ఎగుమతులు మధ్య తేడాను కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో  సర్వీసెస్ ఎగుమతుల నికర విలువ 42.7 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. ఫలితంగా కరెంట్ అకౌంట్  39.1 బిలియన్ డాలర్ల మిగులు నమోదు చేయగలిగింది. వస్తువులకు సంబంధించి ట్రేడ్ డెఫిసిట్ క్యూ4 లో 50.9 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరం క్యూ4 లోని 52.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే తగ్గింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో  44.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు వచ్చాయని, విదేశీ నిల్వలు 63.7 బిలియన్ డాలర్లు పెరిగాయని  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తెలిపింది.