లోన్లలో అక్రమాలపై ఆర్​బీఐ నజర్​

లోన్లలో అక్రమాలపై ఆర్​బీఐ నజర్​
  • అక్రమంగా ఇన్సెంటివ్స్​ ఇస్తే చర్యలు
  • భారీగా జరిమానాల విధింపు

న్యూఢిల్లీ:  రూల్స్​కు విరుద్ధంగా లోన్లు ఇస్తున్న బ్యాంకులపై ఆర్​బీఐ కన్నేసింది. అక్రమాలకు పాల్పడుతున్న దేశీయ బ్యాంకులపై తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఇవి లోన్లను పెంచడానికి, ఉద్యోగులను ప్రోత్సహించడానికి సందేహాస్పద పద్ధతులను ఎంచుకున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్​బీఐ రూల్స్​ ప్రకారం..  కొన్ని రకాల ప్రొడక్ట్‌‌‌‌ లపై మాత్రమే బ్యాంకులు రివార్డులు ఇవ్వొచ్చు. లోన్లు, డిపాజిట్ల వంటి ప్రధాన ఉత్పత్తులకు వీటిని ఇవ్వకూడదు. డిపాజిట్లు చేయించిన ఉద్యోగులకు బహుమతులు, లాటరీలు, ఉచిత పర్యటనలు (భారతదేశంలో /లేదా విదేశాలలో) అందించకూడదని ఆర్​బీఐ స్పష్టం చేసింది.  

ఏజెంట్లకు చెల్లించే కమీషన్లు, డైరెక్ట్ సెల్లింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు  బిజినెస్ కరస్పాండెంట్లకు చెల్లించే చార్జీలను మాత్రం మినహాయిస్తారు. బ్యాంకులలో ఇటువంటి ప్రోత్సాహక పథకాలను అడ్డుకోవడానికి ఆర్​బీఐ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తోంది.  ఉల్లంఘనలకు జరిమానాలు లేదా ఇతర అమలు చర్యలను విధిస్తోంది. పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెంట్రల్ బ్యాంక్ రూ. కోటి జరిమానా విధించింది. 

 డిపాజిటర్లకు అక్రమంగా ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు తేలడంతో ఈ చర్య తీసుకుంది.  కొన్ని డిపాజిట్లను స్వీకరించే సమయంలో బ్యాంకు డిపాజిటర్లకు రూ.250 కంటే ఎక్కువ విలువైన బహుమతులను అందించింది. కాంప్లిమెంటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కోసం సంవత్సర బీమా ప్రీమియం చెల్లించడం వంటివి ఆశచూపింది.  మరొక సందర్భంలో ఒక బ్యాంకు తన సొంత ఉద్యోగులకు రూల్స్​కు వ్యతిరేకంగా ఇన్సెంటివ్స్​ ఇచ్చింది. 

యాక్సిస్​ బ్యాంకు కూడా...

ఈ సంవత్సరం ప్రారంభంలో యాక్సిస్ బ్యాంక్  ప్రైవేట్ సంస్థ భారత్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ వ్యాపారంలో తీవ్రమైన పాలనాపరమైన ఆందోళనలను సీనియర్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజరీ మేనేజర్ ఎత్తిచూపారు. ఈ వ్యాపారం గ్రామీణ భారతదేశం అంతటా రిటైల్,  హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ లోన్లపై దృష్టి సారించింది.  యాక్సిస్ బ్యాంక్ గత ఏడాది జులై, అక్టోబరు క్వార్టర్లలో అక్రమంగా వ్యాపారాన్ని పెంచుకోవడానికి,  ఉద్యోగులకు రివార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించడానికి 'అచీవర్స్ క్లబ్' పేరుతో ప్రోత్సాహక పథకాన్ని నిర్వహించింది.

  ఉద్యోగులకు టూర్లు నిర్వహించింది.  2024 ఆర్థిక సంవత్సరంలో,  భారత్ బ్యాంకింగ్ ద్వారా వచ్చే మొత్తం చెల్లింపులు సంవత్సరానికి 30శాతం,  గ్రామీణ అడ్వాన్సులు 30శాతం పెరిగాయి.  భారత్ శాఖల నుంచి డిపాజిట్లు 12శాతం పెరిగాయి. జూన్ 30 నాటికి, బ్యాంకు  బకాయి డిపాజిట్లు రూ. 10.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి వార్షికంగా 14శాతం పెరిగాయి.