సౌత్ ఇండియన్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( RBI) భారీ జరిమానా విధించింది.డిపాజిట్లపై వడ్డీరేట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సేవపై నిబంధనల పాటించ నందుకు సౌత్ ఇండియన్ బ్యాంకుపై RBI రూ. 59.20 లక్షల జరిమానా విధించింది. సెప్టెంబర్ లో భారత్ లో అతిపెద్ద బ్యాంకు అయిన HDFC కి నిబంధనలు పాటించని కారణంగా రూ. కోటి జరిమానా విధించిన రెండు నెలల తర్వాత తాజాగా సౌత్ ఇండియన్ బ్యాంకుకు జరిమానా పడింది.
కేరళలోని త్రిస్సూర్ కేంద్రంగా నడుస్తున్న సౌత్ ఇండియన్ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 6287 కోట్లు. ఆర్బీఐ ఆదేశాలు, సంబంధిత కరస్పాండెన్స్ లను పాటించడం లేదని నిర్ధారించిన అనంతరం సౌత్ ఇండియన్ బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. విచారణ సమయంలో బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో పెనాల్టీ విధించింది.