బ్యాంక్ ఖాతాదారులకు RBI కీలక హెచ్చరిక కొత్త తరహా సైబర్ దాడులు

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ట్రిక్కులతో కోట్లు కొట్టేస్తున్నారు. పాపం.. అమాయకపు ప్రజలు సైబర్ అటాక్స్ బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ కొత్త తరహా సైబర్ నేరం గురించి హెచ్చరించింది. ఫిషింగ్ మెయిల్స్, మాల్వేర్ లింక్స్, మెస్సేజ్ లు మొబైల్స్ కు పంపి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. కొరియర్ సర్వీస్ అంటూ ఫేక్ మెస్సేజ్ లు పంపి అకౌంట్లో డబ్బులు మాయం చేస్తున్నారంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల్ని అప్రమత్తం చేసింది. కొరియర్ సర్వీస్ ఉంది.. ఛార్జిస్ పే చేయాలి, మీ వివరాలు చెప్పండి అంటూ సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్స్, మెస్సేజ్ లు పంపుతున్నారు.  కొత్త స్కామ్ గురించి RBI శనివారం హెచ్చరిక జారీ చేసింది. 

ALSO READ | గుజరాత్‎లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 36 మంది అరెస్ట్

ఇండియా పోస్ట్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కూడా కొరియర్ సేవల ముసుగులో సైబర్ అటాక్ లు జరుగుతున్నాయని ప్రజలను హెచ్చరించింది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ పట్లు అప్రమత్తంగా ఉండాలని, లింక్ లపై క్లిక్ చేయవద్దని RBI సూచిస్తుంది. ఇండియా పోస్ట్ తమ అధికారిక ఛానెల్ ద్వారా కొరియర్ సర్వీస్ పేరిట జరుగుతున్న నేరాలను గురించి హెచ్చరించింది. ఫేక్ లింక్‌ పంపిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. 

హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు ఇవి పాటించండి:

  • అనౌన్ నెంబర్స్ నుంచి వచ్చిన మెస్సేజ్ లింక్స్ క్లిక్ చేయకండి.
  • కొరియర్ డెలివరీ సర్వీస్ కోసం ఇండియా పోస్ట్ పర్సనల్ డీటేల్స్, డబ్బులు అడగరు.
  • ఫేక్ కాల్స్, మెస్సేజ్ లు వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్ లో కంప్లెయింట్ చేయాలని సూచించారు.
  • ఆర్థిక లావాదేవీల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి.