రెపో రేటు యథాతథం : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

 రెపో రేటు యథాతథం :  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం రోజు కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగానే ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. రెపో రేటును ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్దనే స్థిరంగా ఉంచారు. వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం ఇది వరుసగా 8వ సారి. బుధవారం రోజు ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ఇంధన ధరల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవుతోందన్నారు. అయినప్పటికీ.. ధరల పెరుగుదలపై ఎంపిసి అప్రమత్తంగా ఉందని ఆయన చెప్పారు. 

అయితే  ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని శక్తికాంత దాస్  విచారాన్ని వ్యక్తం చేశారు.  రెండు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత రెపోరేట్ల వివరాలు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. దీంతోపాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF), స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్లను కూడా వరుసగా 6.75%, 6.25% వద్దనే ఉంచింది. చివరిసారిగా రెపో రేటును ఫిబ్రవరి 2023లో పెంచింది. ఈ పెంపు తర్వాత రెపో రేటు 6.5 శాతానికి తగ్గింది.