నవీ ఫిన్సర్వ్‌‌‌‌పై ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఆంక్షలు ఎత్తివేత

నవీ ఫిన్సర్వ్‌‌‌‌పై ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఆంక్షలు ఎత్తివేత

న్యూఢిల్లీ: సచిన్ బన్సాల్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీ నవీ ఫిన్సర్వ్‌‌‌‌పై  విధించిన రిస్ట్రిక్షన్లను  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తాజాగా ఎత్తేసింది. వడ్డీలు భారీగా వేయడం, హిడెన్ ఛార్జీలు వసూలు చేయడం  వంటి విధానాలను ఫాలో అవుతున్నందుకు నవీ ఫిన్సర్‌‌‌‌‌‌‌‌, మరో రెండు ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలపై ఈ ఏడాది అక్టోబర్ 21న ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది. 

ఇవి కొత్త లోన్లు ఇవ్వకూడదని ఆదేశించింది. కేవలం రెండు నెలల్లోనే రిస్ట్రిక్షన్ల నుంచి నవీ ఫిన్సర్వ్‌‌‌‌ బయటపడడం విశేషం. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌పై విధించిన రిస్ట్రిక్షన్లు 13 నెలల పాటు కొనసాగాయి. ఏడు నెలల కిందట కోటక్ బ్యాంక్‌‌‌‌పై రిస్ట్రిక్షన్లు పెట్టగా, ఇప్పటికీ కొనసాగుతున్నాయి.