
న్యూఢిల్లీ: జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లోని 70 శాతం వాటాను జూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అమ్మడానికి ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. కోటక్ మహీంద్రా జనరల్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి కిందటేడాది నవంబర్‌లో జూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. అదనంగా 19 శాతం వాటాను మూడేళ్లలో కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
ఈ మొత్తం డీల్ విలువ రూ.5,560 కోట్లు. కోటక్ బ్యాంక్ షేర్లు బుధవారం 5 శాతం పెరిగి రూ.1,719 దగ్గర సెటిలయ్యాయి. రూల్స్ ప్రకారం, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో 74 శాతం వరకు వాటాను ఫారిన్ కంపెనీలు కొనుగోలు చేయొచ్చు.