Cheque Clearance New System: ఇకపై ఆన్లైన్ సేవలతో సమానంగా చెక్ క్లియరెన్స్: ఆర్బీఐ

Cheque Clearance New System: ఇకపై ఆన్లైన్ సేవలతో సమానంగా చెక్ క్లియరెన్స్: ఆర్బీఐ

న్యూఢిల్లీ:ఇకపై చెక్ క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. దేశంలో ఆర్థిక లావాదేవీలను వేగంగా జరిగేలా  కొత్త చెక్ క్లియరింగ్ మెకానిజం తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). చెక్ క్లియరెన్స్ సమయాన్ని రోజుల నుంచి కొన్ని గంటల్లోకి తగ్గించనున్నట్లు మానిటరీ పాలసీ మీటింగ్ (ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం దేశంలో చెక్ క్లియరెన్స్ కోసం రెండు మూడు రోజుల సమయం పడుతుంది. కొత్త విధానంతో దేశంలో బ్యాంకు వినియోగదారులకు పెద్ద రిలీఫ్ కలగనుంది. 

కొత్త రూల్స్ ప్రకారం.. అదే రోజు చెక్ క్లియరెన్స్

RBI తాజా ప్రకటన చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) యొక్క బ్యాచ్ ప్రాసెసింగ్ మోడ్ నుంచి నిరంతర క్లియరింగ్ మోడల్‌కు మారుతుంది. కొత్త చెక్ క్లియరింగ్ మెకానిజం కింద చెక్‌లు ముందుగా షెడ్యూల్ చేసిన బ్యాచ్‌లలో కాకుండా పని లేదా వ్యాపార దినం అంతటా రోలింగ్ ప్రాతిపదికన స్కాన్ చేయబడి డిస్ ప్లే అవుతాయి. దీంతో వెంటనే క్లియర్ చేయబడతాయి. ఈ ప్రక్రియ.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) , తక్షణ చెల్లింపు సేవ (IMPS) వంటి ఇతర వేగవంతమైన చెల్లింపు పద్ధతులతో సమానంగా చెక్ క్లియరింగ్‌ని తీసుకువస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సిస్టమ్ CTS ఏమిటి?

కొత్త చెక్ క్లియరెన్స్ మెకానిజం కంటే ముందు చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS)గా పిలవబడే ప్రస్తుత వ్యవస్థ అందుబాటులో ఉంది. CTS చెక్కు భౌతిక కదలికను నిలిపివేసే పద్ధతి, బదులుగా చెక్కు ఎలక్ట్రానిక్ చిత్రం క్లియరెన్స్ కోసం చెల్లింపు బ్యాంకుకు పంపబడుతుంది. చెక్కులను ఒక శాఖ నుంచి మరొక శాఖకు మాన్యువల్ ట్రాన్స్ పోర్టు చేస్తుంటారు. దీంతో ఆలస్యం, ఖర్చు అయ్యేది.. సమయం ఆదా, ఖర్చును తగ్గించేందుకు ఈ కొత్త చెక్ క్లియరెన్స్ విధానం ప్రవేశపెట్టబడింది. 

వినియోగదారులకు ప్రయోజనాలు

ఈ కొత్త సిస్టమ్‌తో కస్టమర్లు తమ ఖాతాల్లోకి నిధులను వేగంగా జమ చేస్తారు. ఇది లిక్విడిటీని, ఆర్థిక లావాదేవీల సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అయితే ఈ విధానం అమలు చేయబడుతుందనే దానిపై RBI ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే సెంట్రల్ బ్యాంక్ ప్రకటనతో ఖాతాదారులలో, ఆర్థిక సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.