
- హోమ్ లోన్లపై వడ్డీ తగ్గించిన ఎస్‌బీఐ
న్యూఢిల్లీ:ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో టాప్ బ్యాంకులు కూడా తమ లోన్లపై వడ్డీని తగ్గిస్తున్నాయి. రెపో రేటుకు లింకై ఉన్న లోన్లపై వడ్డీని ఎస్‌బీఐ 0.25 శాతం తగ్గించింది. దీంతో ఇప్పటికే ఇచ్చే లోన్లతో కలిపి బ్యాంక్ హొమ్ లోన్లు, ఆటో లోన్లపై వడ్డీ దిగిరానుంది. ఈ మార్పులు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి.
మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్‌ఆర్– బ్యాంకులు వేసే మినిమమ్ వడ్డీ) తో లింకై ఉన్న లోన్లపై వడ్డీని మార్చలేదు. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా రెపో రేటుతో లింకై ఉన్న లోన్ల వడ్డీని తగ్గించాయి. ఈ నెల ప్రారంభంలో ఆర్‌బీఐ రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.