వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

రేపో రేటుపై కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ఆర్బీఐ చేసిన తాజా ప్రకటనలో రేపో రేటు పెంపుపై క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. వడ్డీ రేటులో ఎటువంటి మార్పు లేదని, ప్రస్తుతం ఉన్న 6.5 శాతాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది ఆర్బీఐ. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఫెడ్ బ్యాంకు తరహాలోనే ఆర్బీఐ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది.దీనికి ముందు జూన్ మాసంలో సైతం ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో సైతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. ఆగస్టులో సైతం వరుసగా తొమ్మిదోసారి రేట్లలో ఎలాంటి మార్పులు ప్రకటించకపోవటం గమనార్హం.

గడచిన 25 ఏళ్లలో  గరిష్ఠంగా వడ్డీ రేట్లను యథాతథంగా కంటిన్యూ చేయటం ఇది రెండవసారి. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లను తగ్గించటానికి వీలు కల్పించటం లేదని తెలుస్తోంది. ఇటీవల ఎస్బీఐ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కూడా ద్రవ్యోల్బణం పరిస్థితి రుతుపవనాలు, వర్షాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడుతుండగా, మరి కొన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదుకావటం ఆందోళన వ్యక్తం చేసింది ఎస్బీఐ.