ముంబై : పండుగ అమ్మకాలు, రూరల్ డిమాండ్ కారణంగా మన ఎకానమీ వేగంగా పుంజుకుంటోందని, అయితే సెప్టెంబరు క్వార్టర్లో కొంత మందగమనం కనిపించిందని ఆర్బీఐ ప్రకటించింది. గ్రోత్నిలకడగా ఉండటం, ధరలు దిగివస్తున్నందున గ్లోబల్ఎకానమీ కూడా బలపడుతుందని ‘స్టేట్ఆఫ్ ఎకానమీ’ పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ పేర్కొంది. కన్సంప్షన్ డిమాండ్ పెరగడం వల్ల ఈ ఏడాది మలి ఆర్నెళ్లలోలో పరిస్థితి మరింత బాగుపడుతుందని తెలిపింది.
‘‘ధాన్యం దిగుమతులు పెరిగాయి. రూరల్ డిమాండ్ ఊపందుకుంది. ఇన్ఫ్రాకు ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతోంది. దీనివల్ల ఎకానమీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి’ అని రిపోర్ట్ స్పష్టం చేసింది. జులై–సెప్టెంబరు క్వార్టర్లో మనదేశ జీడీపీ ఏడు క్వార్టర్ల కనిష్టం 5.4 శాతానికి పడిపోయింది.