ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ వరుసగా పదోసారి రెపోరేటును 6.5శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ పాలసీ సమావేశంలో RBI MPC రెపో రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించింది. US ఫెడరల్ రిజర్వ్ ఇటీవలి రేటు 50 బేసిస్ పాయింట్ల తగ్గుదల ఉన్నప్పటికీ స్థిరంగా ఉంచేందుకు సిద్దమైంది. ఆర్బీఐ విత్ డ్రాల్ నుంచి తటస్థీకరించింది.
స్థూల ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు దృక్పథాన్ని మూల్యాంకనం చేసిన తర్వాత ద్రవ్య విధాన కమిటీ (MPC) 6 మంది సభ్యులలో 5 మంది అంగీకారంతో పాలసీ రేటును 6.5 శాతం వద్ద కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ 2025 ఆర్థిక సంవత్సరం కోసం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతం వద్ద నిలుపుకుందని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టాలరెన్స్ బ్యాండ్‌లో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం 4.8 శాతానికి చేరుకుందన్నారు.
హోం లోన్స్ తీసుకునేవారికి ఆర్బీఐ గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో గృహ రుణాలపై EMI లు తగ్గుతాయని తెలిపారు. అధికత గ్లోబల్ వడ్డీరేట్ల కారణంగా మొదట్లో RBI రేట్లను పెంచింది. అయితే ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటంలో వడ్డీరేట్ల తగ్గించేందుకు అవకాశం ఉంది. అయితే రుణగ్రహీతలు ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్లకు మారడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
రెండేళ్ల క్రితం అధిక ద్రవ్యోల్బణం కారణంగా గ్లోబల్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచినప్పుడు RBI కూడా రెపోరేట్లను పెంచింది. అయితే ఇప్పుడు పరిస్థితి మరో విధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గాయి. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లు తమ FDలను ప్రస్తుత అధిక వడ్డీ రేట్ల వద్ద స్థిరంగా ఉంచుకోవచ్చు.
లోన్ హోల్డర్ల రేట్ల తగ్గింపు విషయంలో కొంత సమయం అంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే రేటు తగ్గింపు రావచ్చు.