
న్యూఢిల్లీ: చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 98.18 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని, కేవలం రూ.6,471 కోట్ల విలువైన నోట్లే ప్రజల దగ్గర ఉన్నాయని ఆర్‌బీఐ శనివారం ప్రకటించింది. రూ. 2 వేల నోట్లను వ్యవస్థలో నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నామని 2023 మే 19న ఈ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
అప్పుడు రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఈ నెంబర్ రూ.6,471 కోట్లకు తగ్గింది. వీటిని బ్యాంకుల దగ్గర ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ చేసుకోవడానికి 2023 అక్టోబర్ 7 వరకు టైమ్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కేవలం 19 ఆర్‌బీఐ రీజినల్ ఆఫీసుల్లోనే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. పోస్ట్ ద్వారా కూడా ఆర్‌బీఐ ఆఫీసులకు నోట్లను పంపించొచ్చు. 2 వేల నోట్లు లీగల్‌గా చెల్లుతాయి.
జన్ఔషధి కేంద్రాల మందుల అమ్మకం విలువ 2024–25లో రూ.రెండు వేల కోట్లకు చేరుకోవచ్చని ఫార్మా, మెడికల్డివైజెస్ బ్యూరో (పీఎంబీఐ) సీఈఓ రవి దదిచ్ చెప్పారు. దేశవ్యాప్తంగా 15 వేల జన్ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి ద్వారా జనరిక్ మందులను తక్కువ ధరకు అమ్ముతుంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1,750 కోట్ల విలువైన అమ్మకాలను సాధించామని జన్ఔషధి దివస్ సందర్భంగా ఆయన అన్నారు.