యాన్యువల్ రిపోర్ట్‌లో ఆర్‌బీఐ వెల్లడి
సర్క్యులేషన్‌లో తగ్గిపోయిన రూ2 వేల నోట్లు
రూ.500, రూ.200 నోట్ల చెలామణి పెరిగింది
న్యూఢిల్లీ : రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను 2 019–20 ఆర్థిక సంవత్సరంలో అసలు ప్రింట్ చేయలేదని ఆర్బీఐ తన యాన్యువల్ రిపోర్ట్ లో వెల్లడించింది. కొన్నేళ్లుగా ఈ నోట్ల సర్కులేషన్ పడిపోతోందని పేర్కొంది. 2018 మార్చితో ముగిసిన నాటికి 33,632 లక్షల పీసెస్‌గా ఉన్న రూ.2 వేల కరెన్సీ నోట్ల సర్కులేషన్… 2019 మార్చి నాటికి 32,910 లక్షల పీసెస్‌కు పడిపోయిందని తెలిపింది. ఆ తర్వాత 2020 మార్చి నాటికి మరింత దిగొచ్చి 27,398 లక్షల పీసెస్‌గానే ఈ నోట్ల సర్కులేషన్ ఉన్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. 2020 మార్చి నాటికి మొత్తం సర్కులేషన్‌లో ఉన్న నోట్లలో రూ.2 వేల కరెన్సీ నోట్లు2.4 శాతంగా ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
వీటి శాతం అంతకు ముందు 2019 మార్చిలో 3 శాతంగా, 2018 మార్చిలో 3.3 శాతం ఉన్నట్టు వెల్లడించింది. విలువ పరంగా రూ.2 వేల నోట్ల షేరు ఈ ఏడాది మార్చి నాటికి 22.6 శా్తానికి దిగొచ్చింది. అంతకుముందు ఏడాది ఈ నోట్లషేరు విలువ పరంగా 31.2 శాతంగా, 2018లో 37.3 శాతంగా ఉంది. ఒకవైపు రూ.2 వేల నోట్ల సర్కులేషన్ పడిపోతూ ఉంటే.. మరోవైపు రూ.500, రూ.200 కరెన్సీ నోట్ల సర్కులేషన్ పెరుగుతున్నట్టు ఆర్‌బీఐ చెప్పింది. 2018 నుంచి మొదలుకుని ఈ మూడేళ్లలో రూ.500, రూ.200 నోట్ల సర్కులేషన్ వాల్యుమ్, విలువ పరంగా పెరిగినట్టుతెలిపింది. 2019–20లో అసలు రూ.2 వేల కరెన్సీ నోట్ల ప్రింట్ చేయలేదని ఆర్బీఐ తన రిపోర్ట్ తెలిపింది. .
ప్రింటింగ్ తగ్గింది..
అంతకుముందు ఏడాదితో పోలిస్తే బ్యాంక్ నోట్ల ప్రింటింగ్ కూడా 2019–20లో 13.1 శాతానికి పడిపోయింది. సప్లయి కూడా 23.3 శాతం తగ్గినగ్గిట్టు పేర్కొంది. కరోనా అవుట్ బ్రేక్‌తో నోట్ల సప్లయి మరింత పడిపోయింది. 2019–20లో రూ.500 నోట్ల ప్రింటింగ్ 1,463 కోట్ల పీసెస్‌గా ఉంటే, సప్లయి 1,200 కోట్ల పీసెస్‌గా ఉంది. రూ.100 డినామినేషన్ నోట్లు330 కోట్ల పీసెస్‌గా, రూ.50
నోట్లు 240 కోట్ల పీసెస్‌గా, రూ.200 నోట్లు 205 కోట్ల పీసెస్‌గా, రూ.10 నోట్లు147 కోట్ల పీసెస్‌గా, రూ.20 నోట్లు 125 కోట్ల పీసెస్‌గా ఉన్నాయి. వీటిలో చాలా వరకు సర్కులేషన్‌లోనే ఉన్నాయి. మొత్తంగా 2,96,695 పీసెస్‌నకిలీ నోట్లను గుర్తించడం జరిగిందని ఆర్‌బీఐ రిపోర్ట్ తెలిపింది.