
డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్ లపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచే లక్ష్యంగా డిజిటిల్ పేమెంట్ల భద్రత, కోసం RBI అనేక చర్యలను అమలు చేస్తోంది. ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేటెస్ట్ టెక్నాలజీతో డిజిటల్ చెల్లింపుల ఇంటెటిజెన్స్ ఫ్లాట్ ఫాం ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ మోసాలను తగ్గించేందుకు సురక్షితమై డిజిటల్ చెల్లింపుల ఇంటెలిజెన్స్ ఫ్లాట్ ఫాం ల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
RBI ప్రతిపాదిత డిజిటల్ పేమెంట్ల ఇంటెలిజెన్స్ ఫ్లాట్ ఫారమం లేటెస్ట్ టెక్నాలజీని వివియోగం ద్వారా కస్టమర్లు, వ్యాపారస్తుల నమ్మకాన్ని పొందేందుకు UPI, డిజిటల్ పేమెంట్ల భద్రతను మెరుగు పర్చేందుకు పనిచేస్తుంది.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు , ఎన్‌బిఎఫ్‌సిల స్థూల ఎన్‌పిఎ (నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్) 3 శాతం కంటే తక్కువగా ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. ఈ సానుకూల ధోరణికి దోహదపడే చెడ్డ రుణాల ప్రొవిజనింగ్, స్థిరమైన మూలధన సమృద్ధి, పెరిగిన లాభదాయకత వంటి అనేక కీలక అంశాలను హైలైట్ చేసింది.