ఇట్స్ అఫిషియల్: కొత్త 50 రూపాయలు నోట్లు వస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి..!

ఇట్స్ అఫిషియల్: కొత్త 50 రూపాయలు నోట్లు వస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి..!

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో కొత్త రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటన చేసింది. కొత్త రూ.50 నోట్లపై ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకం ఉండనుంది.

"గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.50 డినామినేషన్ నోట్లను త్వరలో విడుదల చేయనున్నాం.. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ. 50 నోట్లను పోలి ఉంటుంది.." అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

పాత నోట్లు చెల్లుతాయ్.. అపోహలు వద్దు 

కొత్త నోట్లు వస్తున్నాయంటే.. పాత నోట్లు రద్దవుతాయన్న ప్రచారాలు వస్తుంటాయి. అటువంటి పుకార్లు నమ్మకండి. గతంలో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన రూ. 50 విలువ కలిగిన అన్ని నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో ఎక్కువ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతోనే ప్రచారంలో ఉన్నాయి.

ALSO READ | లోక్‌సభలో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు: మార్పులు, చేర్పులు ఇవే

మరో ఇంపోర్టెంట్ విషయం, కొత్త రూ.50  నోట్లు వస్తున్నాయంటే.. నకిలీ నోట్లు చలామణి అయ్యే అవకాశం లేకపోలేదు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి.