RC16: జాన్వీక‌పూర్ బర్త్డే స్పెషల్.. జాన్వీ రోల్పై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర ట్వీట్

RC16: జాన్వీక‌పూర్ బర్త్డే స్పెషల్.. జాన్వీ రోల్పై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర ట్వీట్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు ఇవాళ (మార్చి 6). ఈ సందర్భంగా రామ్ చరణ్ మూవీ (RC 16) నిర్మాతలు జాన్వీకి విషెష్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. 'RC 16 సినిమా తెరవెనుక (BTS) చిత్రాన్ని పంచుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఫొటోలో 'జాన్వీ ట్రాక్ ప్యాంటు, టీ-షర్టు ధరించి రోడ్డుపై కుడి చేత్తో  గొర్రెపిల్ల‌ను పట్టుకుని, ఎడ‌మ చేత్తో గ‌డ్డి మొక్క‌ను ప‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తోంది'. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో చరణ్, జాన్వీ ఫ్యాన్స్ 'సింపుల్ లుక్.. క్యూట్ స్మైల్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read : కో స్టార్ నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్ అందుకున్న జాన్వీ

డైరెక్టర్ బుచ్చిబాబు విషెష్ చెబుతూ.. "జాన్వీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పనిచేయడం చాలా ఇష్టం. మీ అద్భుతమైన పాత్రను అందరూ తెరపై చూసే వరకు నేను వేచి ఉండలేను" అంటూ బుచ్చి బాబు పోస్ట్ చేశాడు. 

ఇకపోతే.. జాన్వీ కపూర్ వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. పల్లెటూరు అమ్మాయి తంగం క్యారెక్టర్లో జాన్వీ నటించి ఆకట్టుకుంది. ఇపుడు చరణ్ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించనుందో తెలియాల్సి ఉంది. 

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం దాదాపుగా రూ.15 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. 
 
RC 16 విషయానికి వస్తే.. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా..రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్..నిర్మాణంలో సినిమాను నిర్మించనున్నారు.