ఆ రూమర్స్ నమ్మకండి అంటూ RC16 టీమ్ క్లారిటీ..

ఆ రూమర్స్ నమ్మకండి అంటూ RC16 టీమ్ క్లారిటీ..

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రస్తుతం RC16 అనే వర్కింగ్ టైటిల్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపుగా రూ.300 కోట్లు బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తున్నారు.

గత వారం రోజులుగా ఈ సినిమాకి సంబందించిన పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ AR రెహ్మాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడాని, దీంతో మేకర్స్ కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను చవస్తున్నారని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై RC16 టీమ్ స్పందించింది. ఇందులో భాగంగా RC16 నుంచి AR రెహ్మాన్ తప్పుకున్నట్లు వినిపిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూర్తివివరాలు తెలియజేస్తామని అంతవరకూ ఇలాంటి గాసిప్స్, రూమర్స్ నమ్మకండని ఫ్యాన్స్ కి సూచించారు.

ALSO READ | వాట్ ఏ డెడికేషన్... వీల్ చైర్ మీద వచ్చి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందాన

ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది చివరిలో RC16 సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులోభాగంగా మొదటి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూరులో కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. అయితే ఇటీవలే హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ సర్జరీ చేయించుకుని రికవరీ అవుతున్నాడు. దీంతో మార్చి నుంచి శివరాజ్ కుమార్ కూడా  RC16 షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.