రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే22, 2024 బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. బెంగళూరు జట్టుకు ఫినిషర్ గా ఎన్నో సేవలను అందించిన కార్తీక్ గుడ్ బై చెప్పడంతో ఆ జట్టు అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతోనే ఉండబోతున్నాడు. అతన్ని ఆర్సీబీ యాజమాన్యం బ్యాటింగ్ కోచ్ గా, మెంటార్ గా నియమించింది.
“మా కీపర్ దినేష్ కార్తీక్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. అతను ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ గా మెంటార్ గా సేవలను అందిస్తాడు. వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్‌పై అభిమానుల ప్రేమ ఎప్పుడూ అలాగే ఉండాలని ఫ్రాంచైజీ తన అభిమానులను కోరింది. మీరు క్రికెట్ నుంచి అతన్ని తీసేసినా.. అతని నుండి క్రికెట్ ను తీసేయలేరు". అని RCB సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసింది. 2015లో తొలిసారి దినేష్ కార్తీక్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత కొన్ని సీజన్ ల పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ తో తన ప్రయాణాన్ని కొనసాగించిన కార్తీక్ తిరిగి 2022 లో మళ్ళీ బెంగళూరు గూటికి చేరాడు.
Also Read:హోటళ్లలో చిక్కుకుపోయిన టీమిండియా.. అమెరికా బార్బడోస్‌లో తుఫాన్
ఇటీవలే ముగిసిన 2024 సీజన్లో ఆర్సీబీ ఫినిషర్ గా దినేశ్ కార్తీక్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆర్సీబీ తరఫున కార్తీక్ 937 పరుగులు చేశారు. ఓవరాల్ గా ఐపీఎల్ లో 6 టీమ్ లకు ఆడిన కార్తీక్.. 257 మ్యాచుల్లో 4 వేల 842 రన్స్ చేశారు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డీకే అత్యధిక స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 145 క్యాచ్‌లు, 37 స్టంప్ ఔట్లు, 15 రనౌట్స్ చేశాడు.
JUST IN - Dinesh Karthik named RCB's new batting coach and mentor
— Cricbuzz (@cricbuzz) July 1, 2024
👏👏👏 pic.twitter.com/bma8rqbZsc