మెగా వేలంలో తొలి ప్లేయర్‎ను కొనుగోలు చేసిన RCB.. ఎవరా పోటుగాడంటే..?

మెగా వేలంలో తొలి ప్లేయర్‎ను కొనుగోలు చేసిన RCB.. ఎవరా పోటుగాడంటే..?

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ (ఆర్సీబీ) ఎట్టకేలకు తొలి ప్లేయర్‎ను కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియోన్ లివింగ్ స్టన్‎ను రూ.8.75 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. లివింగ్ స్టన్ కోసం ఇతర ప్రాంఛైజ్‎లతో పోటీ పడి మరీ ఆర్సీబీ కైవసం చేసుకుంది. గత సీజన్ లో లివింగ్ స్టన్‎ పంజాబ్స్ కింగ్స్ తరుఫున ఆడాడు. ఆశించిన మేర రాణించకపోవడంతో పంజాబ్ అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో లివింగ్ స్టన్ మెగా వేలంలోకి రాగా ఆర్సీబీ దక్కించుకుంది. 

ఆర్సీబీ.. నెక్ట్స్ సీజన్ కోసం కేవలం ముగ్గురు ప్లేయర్లనే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యశ్ దయాల్ ముగ్గురినే ఆర్సీబీ అట్టిపెట్టుకుని మిగిలిన అందరిని వేలానికి వదిలింది. ఈ మెగా వేలంలో రిషబ్ పంత్, అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్  ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ బిడ్ వేసిన ఇతర ఫ్రాంచైజ్‎ల నుండి తీవ్రమైన పోటీ ఉండటంతో అంత ధర పెట్టలేక ఆర్సీబీ వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి ఒక్క లివింగ్ స్టన్ మాత్రం కొనుగోలు చేసింది.