ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 6) సూపర్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి రాజస్థాన్ ఫుల్ జోష్ లో ఉంటే.. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించిన బెంగళూరు ఒత్తిడిలో కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోతే ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
గ్రీన్, టాప్లీ ఔట్
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టులో ఖచ్చితంగా రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు బ్యాటింగ్, బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపించని ఆల్ రౌండర్ గ్రీన్ స్థానంలో టాప్ ఫామ్ లో ఉన్న విల్ జాక్స్ కు ఛాన్స్ దక్కొచ్చు. విదేశీ బౌలర్ కోటాలో విఫలమవుతున్న టాప్లీ.. లక్నో తో మ్యాచ్ లో విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గుసన్ కు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇక స్పిన్నర్ కరన్ శర్మకు తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఈ మూడు మార్పులు మినహాయిస్తే ఆర్సీబీ తమ ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
ప్రస్తుతం బెంగళూరు జట్టులో కోహ్లీ ఒక్కడే రాణిస్తున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ తో పాటు భారీగా ఆశలు పెట్టుకున్న మ్యాక్స్ వెల్, గ్రీన్ ఘోరంగా విఫలమవుతున్నారు. కీలక మ్యాచ్ లో వీరు ప్రభావం చూపాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయంలో అత్యంత దారుణంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరు నిలకడగా బౌలింగ్ వేయడం లేదు. దీంతో ఈ మ్యాచ్ లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్ ను ఓడించాలంటే శక్తికి మించి పోరాడాల్సిందే. ముఖాముఖి పోరులో RCB రాజస్థాన్‌పై 30 మ్యాచ్‌లలో 15 మ్యాచ్‌లు గెలిచింది. రాజస్థాన్ 12 గెలిచింది. మరో మూడు మ్యాచ్ ల్లో ఫలితం రాలేదు.
Retweet until @RCBTweets see this and picking will jacks into playing 11 pic.twitter.com/QbB5VjZS35
— Kevin (@imkevin149) April 6, 2024