టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గురువారంతో 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని 33వ పడిలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉన్న విరాట్.. తన పుట్టినరోజు వేడుకలను దుబాయ్‌లో జరుపుకున్నాడు. విరాట్ బర్త్ డే సందర్భంగా ఓ షిప్‌లో పుట్టినరోజు వేడుకలకు ప్లాన్ చేశారు. ఈ వేడుకల్లో ఆర్సీబీ ప్లేయర్లందరూ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో విరాట్ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు. కాగా.. బుధవారం ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ వేడుకల్లో పాల్గొన్న ప్లేయర్లు డ్యాన్‌లతో ఆకట్టుకున్నారు. కోహ్లీ కూడా స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇండియన్ టీంకు చెందిన బౌలర్ యజ్వేంద్ర చాహల్, దేవ్‌దత్ పడిక్కల్, శివమ్ ధూబే, ఉమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ఫన్నీ గేమ్‌లతో సాగిన బర్త్ డే పార్టీ.. రాత్రి 12 గంటలు కాగానే కేక్ కటింగ్‌తో షిప్ అంతా మారుమోగిపోయింది. కేక్ కట్ చేయడానికి విరాట్ కత్తి నూరడం అందరినీ నవ్వించింది. కేక్ కట్ చేసిన తర్వాత ముందుగా తన భార్య అనుష్కకు తినిపించాడు. అనుష్క.. విరాట్‌కు కేక్ తినిపించి.. హగ్ ఇచ్చి.. ఆ తర్వాత ఒక ముద్దిచ్చింది. విరాట్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
RCB Insider with Mr. Nags: Virat Kohli’s birthday
Mr. Nags snuck on to the yacht last night. Find out what shenanigans he got into with our stars. #PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL pic.twitter.com/nhGscmQHbd
— Royal Challengers Bangalore (@RCBTweets) November 5, 2020
For More News..