2016 తర్వాత మళ్లీ ఇప్పుడే!

2016 తర్వాత మళ్లీ ఇప్పుడే!

ఆర్‌‌‌‌సీబీ చాలా బ్యాలెన్స్డ్​గా  ఉంది : విరాట్​ కోహ్లీ

దుబాయ్‌‌‌‌: 2016 సీజన్‌‌‌‌ తర్వాత మళ్లీ ఇప్పుడే తమ టీమ్‌‌‌‌ అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్​గా ఉందని రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు(ఆర్‌‌‌‌సీబీ) కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ అన్నాడు.  కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌‌‌‌ జట్టులో ఉన్నప్పటికీ  గత మూడు సీజన్లలో ఆర్‌‌‌‌సీబీ లీగ్‌‌‌‌ దశ దాటలేకపోయింది. అయితే, గత ఓటముల విషయాన్ని వదిలేసి కొత్త సీజన్‌‌‌‌కు ప్రశాంతంగా సిద్ధమవుతున్నానని కోహ్లీ తెలిపాడు. ‘2016 ఐపీఎల్‌‌‌‌.. మా టీమ్‌‌‌‌ అంతటికి చాలా ఇష్టం. ఆ తర్వాత మళ్లీ ఈసారి జట్టు మొత్తం బ్యాలెన్స్డ్​గా ఉంది.ఈ సీజన్‌‌‌‌ మాకు ఓ బ్రేక్‌‌‌‌ త్రూ కానుందని నేను, ఏబీ డివిలియర్స్‌‌‌‌ భావిస్తున్నాం. ఓ సీజన్‌‌‌‌కు ముందు నేనెప్పుడూ  ఇంత ప్రశాంతంగా లేను. కానీ ఏబీ ఎప్పుడూ రిలాక్స్‌‌‌‌గానే ఉంటాడు. లైఫ్‌‌‌‌ను ఎంజాయ్‌‌‌‌ చేస్తూ ఫిట్‌‌‌‌గా ఉంటాడు.  ఈసారి ఐపీఎల్‌‌‌‌ ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌ మునుపటి కంటే చాలా బాగుంది.  గత రిజల్ట్స్‌‌‌‌ తాలుకు భారాన్ని పూర్తిగా వదిలేశాను. వాటి కోసం ఆలోచించి ఇది వరకు చాలాసార్లు దెబ్బతిన్నా. మంచి స్కిల్‌‌‌‌ ఉన్న ప్లేయర్లు మా టీమ్‌‌‌‌లో ఉండడం వల్లే ప్రజలకు మా మీద భారీగా అంచనాలు పెట్టుకుంటారు.  క్రిస్‌‌‌‌ మోరిస్‌‌‌‌ చేరికతో జట్టులో బ్యాలెన్స్‌‌‌‌ వచ్చింది. ఇక, ఆరోన్ ఫించ్‌‌‌‌ అనుభవం మాకు ప్లస్‌‌‌‌ అవ్వనుంది. జోష్‌‌‌‌ ఫిలిప్‌‌‌‌ సహా కొంతమంది యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ను ఈసారి తీసుకున్నాం. వారు ఎలా పెర్ఫామ్‌‌‌‌ చేస్తారో చూడాలని అనుకుంటున్నా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

For More News..

ఎల్వోసీ వెంబడి 400 మంది టెర్రరిస్టులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు కట్టినోళ్లంతా పాస్!

అంపైర్‌ను బాల్​తో కొట్టిన జొకోవిచ్.. డిస్ క్వాలిఫై చేసిన రిఫరీలు