ఇవాళ (ఏప్రిల్ 24) రాజస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆర్సీబీ ఢీ.. సొంతగడ్డపై తొలి విజయంపై బెంగుళూరు గురి

ఇవాళ (ఏప్రిల్ 24) రాజస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆర్సీబీ ఢీ.. సొంతగడ్డపై తొలి విజయంపై బెంగుళూరు గురి

బెంగళూరు: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–18వ సీజన్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థి వేదికల్లో ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మాత్రం తడబడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ పరాజయం పాలై అభిమానులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో గురువారం తమ హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌తో జరిగే పోరులో అయినా ఇంట గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది జరగాలంటే ఆర్సీబీ బ్యాటర్లు మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. 

చిన్నస్వామిలో ఆడిన గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బెంగళూరు 169/8, 163/7, 95/9 (14 ఓవర్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌) స్కోర్లు చేసి ఓటములను ఎదుర్కొంది. ఇతర గ్రౌండ్లలో ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించినా, ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో బౌలర్లకు అనుకూలిస్తున్న చిన్నస్వామి పిచ్‌‌‌‌‌‌‌‌పై గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వచ్చినా బ్యాటర్లు దంచికొట్టాలని ఆర్సీబీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆశిస్తోంది. సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీతో దేవదత్ పడిక్కల్ కూడా ఫామ్‌‌‌‌‌‌‌‌ అందుకోవడం ప్లస్ పాయింట్‌‌‌‌‌‌‌‌. 

లోయర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టిమ్ డేవిడ్ కూడా టచ్‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో జోష్ పెరిగినా... ఫిల్ సాల్ట్‎తో పాటు కెప్టెన్ రజత్ పటీదార్ తమ మార్కు చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇక భువనేశ్వర్ కుమార్ నాయకత్వంలోని బౌలింగ్ మెరుగ్గానే ఉన్నా.. సొంత గ్రౌండ్‌‎లో తమ శక్తిని పూర్తిగా వినియోగించలేకపోతుంది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తే  రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌‎ను మరోసారి ఓడించడంతో పాటు సొంతగడ్డపై ఆర్సీబీ గెలుపు రూచి చూడగలదు.

రాయల్స్‌‌‌‌‌‌‌‌కు చావోరేవో

వరుసగా నాలుగు పరాజయాలకు తోడు గాయంతో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సంజూ శాంసన్ సేవలు కోల్పోయిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఈ మ్యాచ్ చావోరేవో కానుంది. 8 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లలో 6 ఓటములతో రాయల్స్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. మరోటి ఓడితే ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ పై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, లక్నోతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో చేతుల్లోకి వచ్చిన విజయాలను వదులుకున్న రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఒత్తిడిలో ఉంది. శాంసన్ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు కూడా దూరం కాగా, రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా జట్టును నడిపించనున్నాడు. జోరు మీదున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌కు తోడుగా గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. 

కానీ, హెట్‌‌‌‌‌‌‌‌మయర్, నితీష్ రాణా తమ మార్కు చూపెట్టడం లేదు. స్టాండిన్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రియాన్ పరాగ్ సైతం ఆశించిన మేర రాణించడం లేదు. ఆరంభాలు బాగానే ఉంటున్నా.. ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌లో ఆ జట్టు ఘోరంగా తడబడుతోంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతంత మాత్రంగానే రాణిస్తోంది. వానిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ రూపంలో బలమైన బౌలింగ్ లైనప్ ఉన్నా.. సమష్టిగా మెప్పిస్తూ వికెట్లు తీయలేకపోవడం, పరుగులు తగ్గించలేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. దీని నుంచి కోలుకోకపోతే రాయల్స్‌‌‌‌‌‌‌‌ విజయాల బాట పట్టలేదు.