IPL 2024: ఐపీఎల్‌కు ముందు RCB ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..కారణం ఇదే

IPL 2024: ఐపీఎల్‌కు ముందు RCB ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..కారణం ఇదే

దేశంలో ఐపీఎల్ వస్తే చాలు దేశంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఐపీఎల్ 17 వ ఎడిషన్ ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం కూడా లేదు. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ సమరం మొదలవుతుంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో   డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఈ సమయంలో ఆర్సీబి ఫ్యాన్స్ ఒక విషయంలో పండగ చేసుకుంటున్నారు. లాకి ఫెర్గుసన్, ఆకాష్ దీప్ ఆ జట్టులో ఉండటమే. 2024 సీజన్ లో ఆర్సీబీ తరపున ఆడబోతున్న వీరిద్దరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. 

ఆర్సీబికి జట్టుకు భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా.. బౌలింగ్ లో కాస్త బలహీనంగా కనిపిస్తుందనే మాట వాస్తవం. ఒక్కరు కూడా అనుభవమున్న బౌలర్ ఆ జట్టులో లేరు. దీంతో ఈ సారి కూడా కప్ కొట్టడం కష్టమే అనుకున్నారు. అయితే  లాకి ఫెర్గుసన్, ఆకాష్ దీప్ నిన్న అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అదిరిపోయే ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టులో భాగంగా తన పదునైన పేస్ బౌలింగ్ తో టాపార్డర్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ సిరీస్ లో ఫామ్ లో ఉన్న పోప్, క్రాలి, డకెట్  వికెట్లను తీసి తన డెబ్యూ మ్యాచ్ ను ఘనంగా చాటుకున్నాడు. 

మరోవైపు ఫెర్గుసన్ ఆస్ట్రేలియాపై నిన్న జరిగిన రెండో టీ20 ల్లో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. 3.5 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఈ కివీస్ పేస్ బౌలర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్కసారి కూడా 30 కి పైగా పరుగులు సమర్పించుకోలేదు. దీంతో ఆర్సీబీ బౌలింగ్ చాల బలంగా తయారైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరూ ఐపీఎల్ లో కూడా ఇదే ప్రదర్శనతో తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తారో లేదో చూడాలి. 

చెన్నై, ముంబై, మొహాలీ, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, విశాఖపట్నం, హైదరాబాద్ వేదికలు.. తొలి 21 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ  మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. మిగిలిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను వెల్లడించిన తర్వాత ప్రకటించనున్నారు.