ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టుకున్న ఆదరణ గురుంచి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇతర ఫ్రాంచైజీలకు అభిమానులుంటే.. వారికి వీరాభిమానులు ఉన్నారు. ఐపీఎల్ టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకూ ఒక్కసారి ట్రోఫీ గెలవకపోయినా.. ఫ్యాన్ బేస్ విషయంలో ఎప్పుడూ వారిదే పైచేయి. అలాంటిది బెంగళూరులో పుట్టి పెరిగిన ఓ కథానాయిక ఆ జట్టును కాదన్నదని.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శాపనార్థాలు పెడుతూ ఆమెను తిట్టి పోస్తున్నారు.
యువ టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ తన అభిమాన ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ అని వెల్లడించింది. అలా ఆమె ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బెంగళూరులో పుట్టి పెరిగి సన్‌రైజర్స్ టీమ్‌కి ఓటేస్తావా..! అంటూ ఆమెను కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసమే.. హైదరాబాద్ జట్టుకు మద్దతిస్తున్నావ్ అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు.
మీ ట్రోల్స్‌కు భయపడేది లేదు
తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై రాశి సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఎవరి ఇష్టాలు, అభిప్రాయాలు వారివని.. తనకు హైదరాబాద్ అంటే ఇష్టమని వెల్లడించింది. అంతేకాదు, ట్రోల్స్‌కు భయపడి మాట మార్చేదిలేదని విమర్శకులకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
"హలో ఎవరీ వన్.. అందరికి నమస్కారం. నేను హైదరాబాద్ జట్టును సపోర్ట్ చేస్తున్నా. ఈ విషయం చెప్పగానే నాపై నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మెదలుపెట్టారు. మీ అందరికీ నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా. నేను ఉండేది హైదరాబాద్, జాబ్ చేసేది హైదరాబాద్. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో నమ్మకమైన అమ్మాయి దొరకడమే కష్టం. నేను చాలా లోయల్ ఫ్యాన్. ఇప్పుడు మీరు ట్రోల్ చేస్తున్నారని భయపడి ఇంకో టీమ్‌ని నేను సపోర్ట్ చేయలేను.." అని చెప్పుకోచ్చింది.
RCB fans Trolling Her for supporting SRH 🥲🥲 pic.twitter.com/iuEQKfVjeL
— Sailesh🔥 (@MeherRameshFan) April 29, 2024
మరోవైపు, కలర్ ఫొటో ఫేమ్ హీరోయిన్ చాందిని చౌదరి.. 'నాది ఆంధ్ర, మా రాష్ట్రానికి ఐపీఎల్ టీం లేదు..' అంటూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తెలుగు టీమ్ కాదా..! అలాంటప్పుడు హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నావ్ అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.
Chandni Chowdary Andhra ki IPL team. Ledu anyundi, Volunteer Vasu's
— Satyajith (@satyajithpinku) April 30, 2024
Ani okati petandi @ysjaganpic.twitter.com/HEttuwjr8o