IPL 2024 auction: ఆక్షన్ లోకి ఆసీస్ పేసర్.. మాకొద్దు అంటూ దండం పెట్టిన RCB

IPL 2024 auction: ఆక్షన్ లోకి ఆసీస్ పేసర్.. మాకొద్దు అంటూ దండం పెట్టిన RCB

దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2024 మినీ వేలంలో నవ్వు తెప్పించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ పేరు ఆక్షన్ లోకి రాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. బాబోయి మాకు ఈ ప్లేయర్ వద్దు అన్నట్టుగా రెండు చేతులెత్తి దండం పెట్టేసాడు. 

2022 ఐపీఎల్ మెగా వేలంలో హేజిల్ వుడ్ ను భారీ ధరకు దక్కించుకుంది. రూ .7.75 కోట్లు ఈ స్టార్ పేవర్ ను కొనుగోలు చేశారు. అయితే 2024 ఐపీఎల్ కోసం అతన్ని వదిలించుకుంది. దీనికి కారణం 2023లో ఈ ఆసీస్ పేసర్ దారుణంగా విఫలం కావడమే. 2022 సీజన్ లో బాగానే రాణించిన హేజిల్ వుడ్.. 2023 ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. ప్లేయర్ ను వదిలించుకుని ప్రశాంతంగా ఉన్న ఆర్సీబీ మరోసారి వేలంలో కొంటారని భావించినా ఏకంగా దండం పెట్టడం నవ్వు తెప్పించింది. 

ఈ మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంతో హేజిల్ వుడ్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. ఇప్పటికే సగం ఐపీఎల్ కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలన అందుబాటులో ఉండదని తెలిపాడు. ఈ కారణంగానే ఈ ఆసీస్ పేసర్ ను ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు సహచర ప్లేయర్లు మిచెల్ స్టార్క్, కమిన్స్ కు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించారు.  మిచెల్ స్టార్క్(రూ.24.75 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుంది.