
బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచులో బ్యాటింగ్‌లో ఆర్సీబీ విఫలమైంది. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్‌కు అనూకూలించడంతో ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. పంజాబ్ బౌలర్ల ధాటికి పెలివియన్‌కు క్యూ కట్టారు. టిమ్ డేవిడ్ (50) హాఫ్ సెంచరీతో రాణించి బెంగుళూరు పరువు కాపాడాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 95 రన్స్ చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ పటిదార్ (23), టిమ్ డేవిడ్ (50) ఇద్దరూ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగిలిన 8 మంది సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. ఆర్సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (50) టాప్ స్కోరర్. స్టార్ బ్యాటర్స్ సాల్ట్ (4), కోహ్లీ (1), లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ (2) విఫలం కావడంతో ఆర్సీబీ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది.
కాగా, రాత్రి 7 గంటలకు పడాల్సిన టాస్ వర్షం కారణంగా ఆలస్యమైంది. రాత్రి 9.30 గంటలకు టాస్ వేయగా.. పంజాబ్ కెప్టెన్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచును 14 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఇన్సింగ్స్ ఫస్ట్ బాల్కే ఫోర్ట్ కొట్టి జోష్‌లో ఉన్న సాల్ట్‌ను అర్షదీప్ ఔట్ చేశాడు. సాల్ట్ ఔట్‌తో ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది.
సాల్ట్ ఔటైన కాసేపటికే అర్షదీప్ బౌలింగ్లోనే విరాట్ కోహ్లీ (1) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ (1) వెనువెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ పటిదార్ (23) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ (50) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆర్సీబీ పరువు నిలుపుకునే స్కోర్ చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, జెన్సన్, హర్‌ప్రీత్ తలో రెండు వికెట్లు తీయగా.. బార్ట్లెట్ ఒక వికెట్ తీశాడు.