రూ. 11 కోట్ల ఆర్‌సీబీ ప్లేయర్‌కు ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా భాద్యతలు

రూ. 11 కోట్ల ఆర్‌సీబీ ప్లేయర్‌కు ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా భాద్యతలు

మరో రెండు నెలల్లో ఐపీఎల్ 17వ ఎడిషన్ ఫారంభం కానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2వ వారంలో మొదలు పెట్టి.. మార్చి చివరి వారంలోపు ముగించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. మరి ఈసారైనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు టైటిల్ గెలిచేనా అంటే అసంభవమే అనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం వేలంలో ఆ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ఆటగాళ్లే. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడి విఫలమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందునా వీరి కోసం భారీ మొత్తం ఖర్చు చేసింది. 

ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అల్జారీ జోసెఫ్, యష్ దయాల్‌లను ఈసారి ఆర్‌సీబీ జట్టు కొనుగోలు చేసింది. అది కూడా కోట్లకు పడగలెత్తడం ఆశ్చర్యం. అల్జారీ జోసెఫ్ రూ. 11.50 కోట్లు వెచ్చించిన ఆర్‌సీబీ, యశ్ దయాల్ కోసం మరో రూ.5 కోట్లు చెల్లించింది. దీంతో ఈ ప్లేయర్లకు పెట్టిన ఖర్చు చూసి ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ మరోసారి నిరాశపరిచిందని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. వేలం ముగిసి 24 గన్టలు గడుస్తున్నా, ఇప్పటికీ సోషల్ మీడియాలో అదే చర్చ. ఆఖరికి సన్ రైజర్స్ జట్టు కూడా వేలంలో తెలివిగా ప్రదర్శించనుందని తెలుగు జట్టుపైనా ఏడుపు లెక్కిస్తున్నారు. అలా ఏడుస్తున్న వారిలో తెలుగు అభిమానులు కొందరున్నారు. 

సర్ది చెప్పే ప్రయత్నం

దక్షిణాఫ్రికా వేదికగా జరిగే టీ20 లీగ్‌లో డుప్లెసిస్‌ కెప్టెన్సీలో అల్జారీ జోసెఫ్ మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అతని కెప్టెన్సీలో మెరుగ్గా రాణిస్తాడనే నమ్మకంతోనే అతడిని కొనుగోలు చేశామని అభిమానులకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. 

వైస్ కెప్టెన్‌గా భాద్యతలు

ఇదిలావుంటే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అల్జారీ జోసెఫ్‌కు వైస్ కెప్టెన్‌గా భాద్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ కోసం సెలక్టర్లు విండీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా బ్రాత్‌వైట్, వైస్ కెప్టెన్‌గా అల్జారీ జోసెఫ్‌ నియమితులయ్యారు.ఇది తెలిసి ఆర్‌సీబీ అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు. ఆర్‌సీబీ కొనుగోలు చేయడం వల్లే అతను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడని సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 వేలంలో కొన్న ఆటగాళ్లు: 

  • అల్జారీ జోసెఫ్ - రూ.11.50 కోట్లు
  • యశ్ దయాల్ - రూ.5 కోట్లు
  • టామ్ కరన్ - రూ.1.50 కోట్లు
  • లూకీ ఫెర్గ్యూసన్ - రూ.2 కోట్లు
  • స్వప్నిల్ సింగ్ - రూ.20 లక్షలు 
  • సౌరబ్ చౌహాన్ - రూ.20 లక్షలు

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, వైషాక్ విజయ్‌కుమార్, రాజ్ కుమార్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లే, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, మనోజ్ భాండాగే, కర్న్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్.

ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్లు: మయాంక్ డాగర్(సన్ రైజర్స్ నుండి), కామెరాన్ గ్రీన్ (ముంబై ఇండియన్స్ నుండి).