ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టైటిల్ కల నెరవేరేలా లేదు. విజయం కోసం విరాట్ కోహ్లీ ఒక యోధుడిలా పోరాడుతున్నా.. సహచరులన నుంచి కనీస స్పందన కూడా కరువైంది. దీంతో డూప్లెసిస్ సేన హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది.
ఇప్పటివరకూ ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓటమిపాలైన ఆర్‌సీబీ.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. లీగ్ దశలో వారు ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధిస్తే తప్ప 'ప్లే ఆఫ్స్' రేసులో నిలవడం కష్టం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ జట్టు ఆటగాళ్లు.. దేవునిపైనే భారం వేశారు. ఎంత రాణించినా.. విజయాలు జట్టును వరించకపోవడంతో గణేశుని చెంతకు చేరారు.
బెంగళూరు జట్టు తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 11న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబై చేరుకున్న ఆర్‌సీబీ క్రికెటర్లు.. నగరంలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. తమ జట్టును గెలుపు బాట పట్టించాలని ఆర్ధించి..స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న వారిలో యువ క్రికెటర్లు మహిపాల్ లామ్రోర్, పేసర్ విజయ్ కుమార్, సుయాశ్ ప్రభుదేశాయ్‌లు ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
RCB players at the Shree Siddhivinayak Temple for the blessings of Lord Ganesha. pic.twitter.com/xZegZwp6z8
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2024