ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్రస్థానాన్ని దాదాపుగా ముగించింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తప్పకుండా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో నిన్న (ఏప్రిల్ 21) కోల్ కతా నైట్ రైడర్స్ పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో వరుసగా ఐదో పరాజయాన్ని చవి చూసింది. ఇప్పటివరకు 8 మ్యాచ్ లాడితే 7 మ్యాచ్ ల్లో ఓడిపోయి ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్లొచ్చు.
టోర్నీలో ఒక జట్టు 14 మ్యాచ్ లు చొప్పున ఆడుతుంది. ఒక జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆర్సీబీ 8 మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించింది. ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడంతో మిగిలిన మ్యాచ్ ల్లో గెలిచినా అవకాశం లేదనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఐపీఎల్ చరిత్ర గతంలో 7 మ్యాచ్ లు గెలిచినా ప్లే ఆఫ్ కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలా జరగాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో ఆర్సీబీ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్స్ ఉంటాయి.
రన్ రేట్ ను మెరుగుపర్చుకొని మిగిలిన ఆరు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరే అవకాశం లేకపోలేదు. ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా అధికారికంగా ఐపీఎల్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. అయితే ఇలా జరగడం చాలా అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ లో అన్ని జట్లు బలంగానే ఉంటాయి. మొత్తానికి అద్భుతం జరిగితే గాని ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్ళదు.
It's over 💔
— royalchallengersbangallore (@RCBtweetsss) April 22, 2024
.
.
📸©- IPL/BCCI
.
.#rcb #royalchallengersbengaluru #royalchallengersbangallore #cricket #IPL #TATAIPL #PlayBold #ನಮಮRCB #TATAIPL2024 #viratkohli. pic.twitter.com/pgijs6IF7d