'ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క..', 'ఈసారి కప్ ఆర్‌సీబీదే.. ఆపేవాడేలేడు..', 'మే 26న ట్రోఫీ అందుకునేది కోహ్లీనే రాసిపెట్టుకోండి.." ఇవేంటి సినిమా డైలాగ్స్‌లా ఉన్నాయ్ అనుకుంటున్నారా..! అనుకోవడాలు అక్కర్లేదు.. సినిమా డైలాగులే. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు అభిమానులు పేల్చిన తూటాలివి. మరి, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో తెలుసా..! టైటిల్ సంగతి దేవుడెరుగు.. తమ అభిమాన జట్టు కనీసం ప్లేఆఫ్స్ కైనా చేరుతుందా..! లేదా అని లెక్కలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఏడాది ఆర్‌సీబీ ప్లేఆఫ్‌లకు చేరే అవకాశం ఇంకా ఉందా? లేక అందరికంటే ముందే అస్సాం బండి ఎక్కనుందా.. చూద్దాం..
ఎప్పటిలాగానే ఈ ఏడాది ఆర్‌సీబీ ప్రదర్శన అంతంత మాత్రమే. ఇప్పటివరకూ ఆడిన 6 మ్యాచ్‌ల్లో డుప్లెసిస్ సేన కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. ఫలితంగా 2 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. లీగ్ దశలో వీరింకా ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏడింటిలో విజయం సాధిస్తే తప్ప ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. అనుకున్నట్లుగా ఏడింటిలో విజయం సాధిస్తే.. 16 పాయింట్లు ఖాతాలో చేరుతాయి. అప్పుడు టాప్-4లో నిలిచే అవకాశం ఉంది.
అలా జరిగితే.. అలవోకగా ప్లేఆఫ్స్‌కు..!
ఒకవేళ ఎనిమిదికి 8 గెలిస్తే.. అప్పుడు 18 పాయింట్లతో సులువుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కాదని, ఒక మ్యాచ్‌లో ఓడినా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అయితే, ఆ సమయంలో రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. అలా కాకుండా, రెండింటిలో ఓటమిపాలైతే.. ఖాతాలో 14 పాయింట్లే చేరతాయి. అప్పుడు ఇతర జట్ల విజయావకాశాలపై ఆధారపడాల్సిందే. ప్రస్తుతానికి ఆర్‌సీబీ నెట్ రన్‌రేట్(-1.124) కూడా దారుణంగానే ఉంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లలో అత్యల్ప రన్‌రేట్ వీరిదే.
గతాన్ని పరిశీలిస్తే..
గడిచిన రెండు సీజన్ల(2022, 2023) పాయింట్స్ టేబుళ్లను పరిశీలిస్తే.. 16 పాయింట్లు సంపాదించిన జట్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. 2022లో ఆర్‌సీబీ 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 2023లో ముంబై ఇండియన్స్ కూడా అలా ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టే. ఈ గణాంకాలను బట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మిగిలిన ఎనిమిదిలో ఏడింటిలో గెలిస్తే తప్ప ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవన్నది సత్యం.
ఆర్‌సీబీ తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్
- ఏప్రిల్ 15న.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో
- ఏప్రిల్ 21న.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
- ఏప్రిల్ 25న.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో
- ఏప్రిల్ 28న.. గుజరాత్ టైటాన్స్‌తో
- మే 04న.. గుజరాత్ టైటాన్స్‌తో
- మే 09న.. పంజాబ్ కింగ్స్‌తో
- మే 12న.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో
- మే 18న.. చెన్నై సూపర్ కింగ్స్‌తో
Here's how the points table looks after 26th match the Rajasthan Royals secure their first position in points table, though they have lost their first match.
— SPORTS WIZ (@mysportswiz) April 13, 2024
.#PointsTableIPL #IPLupdates #MSDhoni #Yuzi #IPL2024 #Sportswiz #RajasthanRoyals #RRvsGT #RRvsPBKS #PBKSvsRR pic.twitter.com/94FdSPwG9s