ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఆ జట్టు బౌలర్లపై పగ పట్టింది. ఒకరు కాదు ఇద్దరి కాదు ఏకంగా అరడజను మంది బౌలర్లపై వేటు వేసింది. జోష్ హేజల్ వుడ్, హసరంగా, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లి లాంటి ఆల్ రౌండర్లను వదిలేసుకొని సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాన బౌలర్లలో సిరాజ్ ఒక్కడే ఆర్సీబీ జట్టులో ఉన్నాడు. అయితే ఇంతమంది బౌలర్లపై వేటు వేసిన బెంగళూరు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ ను పట్టేసింది.
2023 లో గ్రీన్ ముంబై జట్టు తరపున ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో 17.5 కోట్ల రికార్డ్ ధరకు గ్రీన్ ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.తాజాగా ట్రేడింగ్ ద్వారా ముంబై నుండి ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను ఆర్సీబీ దక్కించుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బెంగళూరు 17.50 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా ఆర్సీబీ జట్టులో కీలక బౌలర్లుగా ఉంటున్న జోష్ హేజల్ వుడ్, హసరంగా, హర్షల్ పటేల్ ను ఆర్సీబీ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. హసరంగా 10.75 కోట్లకు, హర్షల్ పటేల్ 10.75 కోట్లకు, హేజల్ వుడ్ 7.75 కోట్లకు ఆర్సీబీ జట్టు తరపున ఆడారు.
ప్రస్తుతం వీరు ముగ్గురు కూడా పేలవ ఫేమ్ లోనే ఉన్నారు. హసరంగా గాయం నుంచి కోలుకుంటున్నాడు. హర్షల్ పటేల్ మునుపటి స్థాయి బౌలింగ్ చేయలేకపోతున్నాడు. హేజల్ వుడ్ పర్వాలేదనిపిస్తున్నా ఈ స్టార్ బౌలర్ పై నమ్మకం ఉంచలేదు. వీరి ముగ్గురిని వదిలేసుకోవడం ద్వారా ఆర్సీబీ జట్టుకు 30 కోట్లు మిగులుతుంది. ఇక ఆర్సీబీ జట్టులో చేరడం ద్వారా ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టంగా తయారైంది. ఇప్పటికే ఆ జట్టులో కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్, పటిదార్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మరి గ్రీన్ రాకతో ఆర్సీబీ ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందో చూడాలి.
CAMERON GREEN HAS JOINED RCB FOR IPL 2024...!!!! pic.twitter.com/JIzsNnbQ6H
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 26, 2023