IPL Retention 2025: ఆర్సీబీ రిటైన్ లిస్ట్ రిలీజ్: విధ్వంసకర బ్యాటర్లను వదులుకున్న బెంగుళూరు

IPL Retention 2025: ఆర్సీబీ రిటైన్ లిస్ట్ రిలీజ్: విధ్వంసకర బ్యాటర్లను వదులుకున్న బెంగుళూరు

నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ (2025) కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‎ను విడుదల చేసేందుకు ఇవాళే (అక్టోబర్ 31) చివరి రోజు కావడంతో అన్ని ఫ్రాంచైజ్‎లు.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, వదిలేసుకున్న ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. ఈ  నేపథ్యంలో రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ఆర్సీబీ వెల్లడించింది. టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్, బౌలర్ యశ్ దయాల్‎ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు, రజత్ పాటిదార్‎కు రూ.11 కోట్లు, యశ్ దయాల్‎కు రూ.5 కోట్లు చెల్లించింది.

 ఈ ముగ్గురి కోసం ఆర్సీబీ తమ పర్స్‎లోని రూ.37 కోట్లు కేటాయించింది. మిగిలిన రూ.83 కోట్లతో ఆర్సీబీ మెగా వేలానికి వెళ్లనుంది. అయితే, ఆర్సీబీ తమ టీమ్ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్,  టీ20ల్లో విధ్వంసర ఆటగాడిగా పేరుగాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‎ను ఆర్సీబీ వేలానికి వదిలేసింది. విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో.. ఆర్సీబీ పగ్గాలను డూప్లెసిస్ చేపట్టాడు. డూప్లెసిస్ కెప్టెన్సీలోనూ ఆర్సీబీ రాత మారలేదు. 

ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతి సీజన్‎లో భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. లీగ్ చివర్లో చేతులు ఎత్తేయడం అలవాటుగా మారింది. ఆర్సీబీకి ఎన్నో ఏళ్ల కళ అయిన  ఐపీఎల్ ట్రోఫీ డూప్లెసిస్ కెప్టెన్సీలోనూ తీరలేదు. దీంతో అతడిని ఆర్సీబీ పక్కనబెట్టింది. ఇక, తన ఆటతో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఉన్న డేంజరస్ బ్యాటర్ మ్యాక్స్ వెల్ గత ఐపీఎల్ సీజన్‎లో దారుణంగా విఫలమయ్యాడు.

ALSO READ | IPL Retention 2025: క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జాక్ పాట్.. సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్లు వీరే

కొన్ని మ్యాచుల్లో కనీసం అతడికి ప్లేయింగ్ లెవన్‎లో కూడా చోటు దక్కలేదంటే మ్యాక్స్‎వెల్ ఆట ఏ తీరుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పూర్ ఫర్ఫామెన్స్ కారణంగా మ్యాక్సీని ఆర్సీబీ వచ్చే ఏడాదికి రిటైన్ చేసుకోలేదు. స్వింగ్ బౌలింగ్‎తో ప్రత్యర్థులను బెంబేలేత్తించే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‎ను కూడా ఆర్సీబీ వదిలేసుకోవడం గమనార్హం. రిటైన్షన్ పాలసీలో భాగంగా మొత్తం ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉన్న ఆర్సీబీ ముగ్గురినే రిటైన్ చేసుకుని డేంజరస్ బ్యాటర్లను వేలానికి విడిచిపెట్టింది.

RCB రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా: 

విరాట్ కోహ్లీ (21 కోట్లు), యశ్ దయాల్ (5 కోట్లు), రజత్ పటీదార్ (11 కోట్లు)

RCB విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా:

దినేష్ కార్తీక్, మహ్మద్ సిరాజ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేసాయి, ఆకాష్ దీప్, మయాంక్ డాగర్, కర్ణ్ శర్మ, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్, ఫాఫ్ డు ప్లెనిస్ (c), మాక్స్‌వెల్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, రీస్ టాప్లీ, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, టామ్ కర్రాన్