RCB vs CSK: ప్లే ఆఫ్స్ కు RCB.. అభిమానుల ప్రేమ, కోహ్లీ సంకల్పమే కారణం

RCB vs CSK: ప్లే ఆఫ్స్ కు RCB.. అభిమానుల ప్రేమ, కోహ్లీ సంకల్పమే కారణం

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌లో 27 రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సత్తా చాటింది. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్లడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక దశలో ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన బెంగళూరు.. ఒకొక్క మ్యాచ్ గెలుస్తూ వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరి అన్ని జట్లకు షాక్ ఇచ్చింది. ఒకరకంగా ఐపీఎల్ లో ఇది బెస్ట్ కంబ్యాక్ అని చెప్పవచ్చు. 

కోహ్లీ, అభిమానుల నమ్మకమే నిలబెట్టింది

ఈ సీజన్ లో తొలి 8 మ్యాచ్ లో బెంగళూరు ఒకటే మ్యాచ్ గెలిచింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. సాధారణంగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే 8 మ్యాచ్ ల్లో గెలవాలి. కొన్నిసార్లు 7 మ్యాచ్ లు గెలిచినా అదృష్టవశాత్తు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సరిగా ఆర్సీబీ విషయంలో ఇదే జరిగింది. ఏ మాత్రం నమ్మకం కోల్పోకుండా ప్రతి మ్యాచ్ లో విజయం సాధిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని ఓడిపోయే మ్యాచ్ ల్లోనూ నెగ్గింది. వరుసగా 6 మ్యాచ్ ల్లో గెలిచి నెట్ రన్ రేట్ తో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 

ఇతర మ్యాచ్ ల ఫలితాలు కూడా అనుకూలంగా రావడం ఆర్సీబీకు కలిసి వచ్చింది. ఈ విజయాల్లో ప్రధాన కారణం కోహ్లీదే అని చెప్పుకోవాలి. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నా.. బయట నుంచి విమర్శలు వస్తున్నా కోహ్లీ తన నమ్మకం కోల్పోలేదు. తన జట్టు ప్రతి మ్యాచ్ విజయం సాధిస్తుందని నమ్మాడు. ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద పారిస్తూ జట్టును తన భుజాలపై మోశాడు. ఓ వైపు నిలకడాగా ఆడుతూనే.. మరోవైపు వేగంగా పరుగులు చేసి ఆర్సీబీ ప్రతి మ్యాచ్ ల్లో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఇక బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో ఫ్యాన్స్ పరోక్ష కారణం. ఓడిపోతున్నా నిరాశ పడకుండా జట్టును సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకరకంగా జట్టు కంటే వీరే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందని బలంగా నమ్మారు. ఫ్యాన్స్ తో పాటు నిన్న (మే 18) జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ మహిళల జట్టు మాజీ ఆటగాడు గేల్ సైతం ఆర్సీబీను మ్యాచ్ చూడడానికి వచ్చి జట్టును ఎంకరేజ్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టు గెలవాగానే చిన్నస్వామి స్టేడియం గోలతో హోరెత్తింది. ఫ్యాన్స్ ఇలాగే సపోర్ట్ చేస్తే ఆర్సీబీ ఈ సీజన్ ఛాంపియన్ గా నిలిచినా ఆశ్చర్యం లేదు.