ఏప్రిల్ 25న జరిగే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ‑సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్ టికెట్లు లభించక ఫ్యాన్స్ నిరాశ

ఏప్రిల్ 25న జరిగే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ‑సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్ టికెట్లు లభించక ఫ్యాన్స్ నిరాశ
  • టికెట్లన్నీ నిమిషాల్లోనే మాయం
  •     బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని అనుమానం

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు టికెట్లు సంపాదించడం అభిమానులకు కలగా మారింది. సీఎస్కే–సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచిన నిమిషాల్లోనే అమ్ముడవగా.. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ–సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్లు కూడా అలానే మాయం అయ్యాయి. ఈ నెల 25న ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీతో, మే2న రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల టికెట్లను పేటీఎం శుక్రవారం ఉదయం వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పెట్టింది. 

అయితే, సేల్ మొదలైన కాసేపటికే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి  కార్పొరేట్ బాక్సులు మినహా అన్ని రకాల టికెట్లూ సోల్డ్ అవుట్ అని కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. చాలా మంది అభిమానులు సేల్ మొదలైనప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా తమకు టికెట్లు లభించలేదని చెబుతున్నారు. కోహ్లీ బరిలో ఉన్న నేపథ్యంలో  ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్లకు భారీ డిమాండ్ ఉంది. కానీ, 39 వేలు సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలో టికెట్లన్నీ  నిమిషాల్లోనే ఎలా అమ్ముడవుతాయని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  

సీఎస్కే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. సాధారణ టికెట్లతో పాటు ఉచితంగా ఇచ్చే కాంప్లిమెంటరీ పాసులను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  అయితే,  ఆయా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి ఎన్ని టికెట్లను అమ్మకానికి పెట్టారు? ఎన్ని టికెట్లను కాంప్లిమెంటరీగా ముద్రిస్తున్నారు? వాటిని ఎవరికి ఇస్తున్నారు?  అనే విషయాలపై  అటు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాజమాన్యం, ఆతిథ్య హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎలాంటి ప్రకటనా చేయడం లేదు.