RCB vs CSK: పర్లేదు అనిపించిన బెంగళూర్.. చెన్నై టార్గెట్ 197

RCB vs CSK: పర్లేదు అనిపించిన బెంగళూర్.. చెన్నై టార్గెట్ 197

చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ హై ఓల్టేజ్ మ్యాచ్ లో బెంగళూర్ తడబడుతూ నిలబడుతూ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. చెపాక్ స్టేడియం కావడం.. అందులో స్పిన్ కు అనుకూలించడంతో స్పిన్నర్లు విజృంభించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. RCB ని కట్టడి చేయడంలో సఫలం అయ్యింది. 

తొలుత బ్యాటింగ్ కు వచ్చిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 రన్స్ చేయగలిగింది. ఓపెనింగ్ జోడి కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ మంచి ఆరంభం కోసం ట్రై చేశారు. ఈ ప్రయత్నంలో సాల్ట్ సక్సెస్ అయినట్లే అనిపించి పవర్ ప్లేకు ముందుగానే ఔట్ తో వెనుదిరిగాడు. ఫోర్లు (5), సిక్సర్ (1)తో విరుచుకుపడిన సాల్ట్ 16 బాల్స్ ఫేస్ చేసి 32 రన్స్ కు ధోనీ ఫెంటాస్టిక్ స్టంప్ తో ఔటయ్యాడు. 

ALSOREAD | ధోనీ మాయాజాలం.. కళ్లు మూసి తెరిచే లోపే స్టంప్.. అదే కదా మహీ స్పెషల్

ఇక పవర్ ప్లేలో వీలైనన్ని రన్స్ పిండుకోవాలని ఆవేశం మీద కనిపించిన కోహ్లీ.. ఆరంభంలో అంతగా రన్స్ చేయలేకపోయాడు. ఎంత ట్రై చేసిన కనెక్ట్ కాకపోవడంతో స్కోర్ బోర్డ్ స్లోగానే మూవ్ అయ్యిందని చెప్పవచ్చు. మొత్తం 30 బాల్స్ ఆడిన కోహ్లీ 2 ఫోర్లు, 1 సిక్స్ తో 31 రన్స్ చేసి అశ్విన్న బౌలింగ్ లో నూర్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 

కోహ్లీకంటే ముందు.. సాల్ట్ తర్వాత వచ్చిన పడిక్కల్ 7.5 వ ఓవర్ దగ్గర అశ్విన్ బౌలింగ్ లో రుతురాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 2 ఫోర్లు, 2 సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. 

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్.. మ్యాచ్ బాధ్యతను భుజాలపై వేసుకున్నట్లుగా అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆఫ్ సెంచరీ చేశాడు. మొత్తం 32 బాల్స్ ఆడిన పటిదార్.. 4 ఫోర్లు, 3 సిక్సులతో మ్యాచ్ పై గ్రిప్ సాధించే ప్రయత్నం చేశాడు. చివరి వరకు ఆడే ప్రయత్నం చేశాడు కానీ పతిరణ బౌలింగ్ లో సామ్ కరణ్ కు క్యాచ్ ఇచ్చి 18.1 ఓవర్లో 51 రన్స్ చేసి  ఔటయ్యాడు. 

ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్(10), కృనాల్ పాండ్య(0) నిరాశ పరిచారు. చివరిలో టిమ్ డేవిడ్ వరుస సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. శామ్ కరణ్ బౌలింగ్ లో చివరి ఓవర్ లో 2 డాట్ బాల్స్ అయినప్పటికీ.. 3,4,5 వ బాల్స్ ను సిక్స్ గా మలచడంతో మ్యాచ్ లో కాస్త ఊపు వచ్చిందని చెప్పవచ్చు.

కట్టడి చేసిన బౌలర్లు:

బెంగళూర్ ను కట్టడి చేయడంలో చెన్నై బౌలర్లు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. స్పిన్ అనుకూలించే పిచ్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. మొదటి నుంచీ RCB బ్యాటర్స్ ను నిలువరించడంలో సఫలం అయ్యారు. ఫోర్లు సిక్సర్లతో ఊపు మీద ఉన్న చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతున్న ఓపెనర్ ఫిలఫ్ సాల్ట్ ను రెప్పపాటులోనే ఔట్ చేసి పంపించేశాడు. నూర్ వేసిన ఫుల్ లెంత్ బాల్ మిస్ అయ్యి ధోనీ చేతిలో పడటం.. వెంటనే స్టంప్ చేయడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయాయి.  ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ ను 27 రన్స్ వద్ద ఔట్ చేశాడు. ఫుల్ లెంగ్ బాల్ వేయడంతో.. రుతురాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు పడిక్కల్. విధ్వంసక బ్యాట్స్ మెన్ లివింగ్ స్టోన్ ను కూడా ఔట్ చేసి.. బెంగుళూర్ ను గట్టి దెబ్బ కొట్టాడు నూర్ అహ్మద్.

ఆ తర్వాత గాయాలతో దూరంగా ఉండి ఈ మ్యాచ్ కు వచ్చిన పతిరణ.. 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.