RCB vs CSK: చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ.. విజృంభించిన బౌలర్లు.. కష్టాల్లో సూపర్ కింగ్స్

RCB vs CSK: చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ.. విజృంభించిన బౌలర్లు.. కష్టాల్లో సూపర్ కింగ్స్

చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరంభంలోని గట్టి షాక్ ఇచ్చాడు RCB బౌలర్ హెజిల్ వుడ్. బెంగళూర్ ను 196 రన్స్ కు కట్టడి చేసి ఊపు మీద ఉన్న CSK మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఓవర్ లో.. అదీ పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయి డిఫెన్స్ లో పడింది. 

ఫస్ట్ ఓవర్ లో భువనేశ్వర్ బౌలింగ్ లో 7 రన్స్ తో స్లోగా స్టార్ట్ చేసిన చెన్నై ఓపెనర్లను.. రెండో ఓవర్లో బ్రేక్ చేశాడు. రాహుల్ త్రిపాఠీని రెండో ఓవర్లో 2వ బాల్ కు ఔట్ చేశాడు. షాట్ లెంత్ బాల్ ను షాట్ ఆడటానికి ప్రయత్నించిన త్రిపాఠీ.. మిడ్ వికెట్ మీదుగా ఫిలిప్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ALSO READ | RCB vs CSK: పర్లేదు అనిపించిన బెంగళూర్.. చెన్నై టార్గెట్ 197

ఆ తర్వాత ర2వ ఓవర్ చివరి బాల్ కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను పెవిలియన్ కు పంపి గట్టి దెబ్బ కొట్టాడు. హెజిల్ వు డ్ వేసిన షార్ట్ లెంత్ బాల్ ను షాట్ గా మలిచే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ ప్లేలో ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి చెన్నై కాన్ఫిడెన్స్ దెబ్బ తీశాడు. దీంతో 8 రన్స్ కే 2 వికెట్లు పోయి డిఫెన్స్ లో పడింది చెన్నై.

దీపక్ హుడాను వెనక్కు పంపిన భువీ:

ఆ తర్వాత 4వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ఫుల్ లెంత్ బాల్ వేసి దీపక్ హుడాను 4 రన్స్ కే ఔట్ చేశాడు. 4.4 ఓవర్ దగ్గర దీపక్ హుడాను పెవిలియన్ పంపాడు భువి. ఫుల్ లెంత్ బాల్ కనెక్ట్ కాకపోవడంతో కీపర్ జితేశ్ శర్మ క్యాచ్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో.. కెప్టెన్ రజత్ పాటిదార్ రివ్యూ తీసుకున్నాడు. అల్ట్రా ఎడ్జ్ లో బాల్ బ్యాట్ కు తగిలినట్లు చూపించడంతో ఫోర్త్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో 26 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మొత్తంగా తక్కువ స్కోర్ కే కట్టడి చేశామని కాన్ఫిడెన్స్ తో ఉన్న చెన్నైని ఆరంభంలోనే గట్టి దెబ్బ కొట్టారు RCB బౌలర్లు.